ETV Bharat / state

ROB Construction Issue In Mahbubnagar District : రెండేళ్లుగా ముందుకు సాగని పనులు.. నిత్యం నరకం చూస్తున్న ప్రయాణికులు - మహబూబ్​నగర్​లో ఆర్​వోబీ నిర్మాణం పనుల్లో జాప్యం

ROB Construction Issue In Mahbubnagar District : నాగర్​కర్నూల్, వనపర్తి నుంచి హైదరబాద్​కు వెళ్లాలంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటాలి. దీని నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా.. పూర్తి కాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వంతెన నిర్మించకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ ఎక్కువవుతుందని.. వెంటనే దాని నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ROB Construction Issue
ROB Construction Issue In Mahabubnagar District
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2023, 7:53 PM IST

ROB Construction Issue In Mahabubnagar District : నాగర్ కర్నూల్, వనపర్తి నుంచి జడ్చర్ల మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాలంటే.. రైల్వే పైవంతెనను దాటాలి. మహబూబ్​నగర్ నుంచి కల్వకుర్తికి వెళ్లాలన్నా.. ఆ వంతెన నుంచే ప్రయాణం చేయాలి. అవే కాకుండా జడ్చర్లలో రైల్వేట్రాక్ అవతలి నుంచి ఇవతలికి రావాలంటే ఉన్నది ఆ ఒక్క మార్గమే. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే పాత వంతెనను తొలిగించి, రెండు వరుసల్లో కొత్త వంతెనను నిర్మించకపోవడం వల్ల జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. ఏళ్లుగా ఆర్వోబీ (ROB In mahabubnagar)నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.

ROB in Devarakadra : దేవరకద్రలో తుది దశకు ఆర్వోబీ పనులు.. గంటల కొద్ది నిరీక్షణకు తెర

Delay in ROB Construction in Mahabubnagar District : కోదాడ-రాయచూరు 167వ నంబర్ జాతీయ రహదారిపై మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద నిర్మించాల్సిన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం.. జడ్చర్లలో ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అక్కడ పాత వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా.. ఏళ్లుగా పనులు నత్తనడకన సాగడం ఇబ్బందిగా మారింది. రోడ్డు ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయి. చిన్న అడ్డంకి ఏర్పడినా ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఆ వంతెన గుండా ప్రయాణించాల్సిన వేలాది వాహనదారులు.. నిత్యం నరకం అనుభవిస్తున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్‌కు జడ్చర్ల మీదుగా హైదారాబాద్ వెళ్లే వాహనాలు, మహబూబ్​నగర్ నుంచి కల్వకుర్తి వెళ్లే వాహనాలు, పట్టణంలో ట్రాక్ అవతలి నుంచి ఇవతలికి వెళ్లే వాహనాలతో నిత్యం ఆర్వోబీ రద్దీగా ఉంటోంది.

"సిగ్నల్ గడ్డ దగ్గర నుంచి వెళ్లాలి అనుకుంటే ఒకటే రహదారి. అలా వెళ్లడానికి కుదరదు. సాయంత్రం 4 గంటలు దాటిందంటే స్కూల్స్, కాలేజీలు అయిపోయే సమయం.. అప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది. వర్షాకాలం వస్తే సమస్య ఎక్కువవతుంది. పూర్తి చేస్తామని చెప్తున్నారు కానీ పనులు మాత్రం చేయడం లేదు. అంబులెన్స్ వెళ్లాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైనా ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్నాం." - స్థానికులు

సిగ్నల్‌ గడ్డ వంతెన వద్ద ట్రాఫిక్‌ స్తంభిస్తే భారీ వాహనాలు 15 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులకు దారి దొరకటం లేదు. పాత బస్టాండ్ వద్ద గతంలో ఉన్న రైల్వే గేటును సాంకేతిక కారణాలతో మూసేశారు. దానికి బదులుగా నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. గంగాపూర్‌ నుంచి బోయలకుంట, చెర్లపల్లి, నాగసాల, ఆలూరు రైల్వే అండర్‌ బ్రిడ్జి మీదుగా బూరెడ్డిపల్లి వరకు బైపాస్ నిర్మిస్తే ట్రాఫిక్‌ సమస్య తీరనుంది.

Nizamabad: మాధవనగర్​ రైల్వే ఓవర్​ బ్రిడ్జి పనులు వేగవంతం.. ఇంకా కొన్ని రోజుల్లోనే..!

భారీ వాహనాలు రైల్వే ట్రాక్ దాటాలంటే ఈ ఒక్క మార్గం మాత్రమే ఉండటం రద్దీకి అసలు కారణం. అందుకే ఆర్ఓబీని త్వరగా పూర్తి చేయాలని లేదా బైపాస్, అవుటర్ రింగ్ రోడ్డు లాంటి ప్రత్యామ్నాయ దారుల్ని అభివృద్ధి చేయాలని పట్టణ వాసులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికుల అభ్యంతరాలు, రాజకీయ కారణాల వల్లే వంతెన నిర్మాణం అలస్యమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ప్రజలు జనం కోరుతున్నారు.

ROB Construction Issue In Mahabubnagar District రైల్వే బ్రిడ్జిని మొదలుపెట్టి రెండేళ్లు కానీ ఇంకా మొదటి దశలోనే పనులు

ఎట్టకేలకు బ్రిడ్జి పనులు ప్రారంభం.. ఇందూరు వాసుల ఇబ్బందులకు చెక్‌

మూడు గంటల్లో రైల్వే అండర్ పాస్​ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.