ETV Bharat / state

భారీ వర్షం.. 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతున్న ఊరచెరువు

మహబూబ్​నగర్​లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండిపోయాయి. అడ్డాకుల మండలం శాగాపూర్ సమీపంలోని ఊర చెరువు 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది.

roads damaged in mahabubnagar district due to heavy rain
మహబూబ్​నగర్​ జిల్లాలో భారీ వర్షం
author img

By

Published : Sep 19, 2020, 2:25 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా అడ్డాకుల మండలం శాగాపూర్​ సమీపంలోని ఊర చెరువు 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది. వరద నీటి ఉద్ధృతితో 44వ జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు దెబ్బతిన్నది. కర్నూల్ నుంచి హైదరాబాద్​ వెళ్లే జాతీయ రహదారి కుంగిపోవడం వల్ల గ్రామస్థులు అప్రమత్తమై.. ఆ దారిలో వచ్చే వాహనాలను నిలిపివేశారు.

అనంతరం పోలీసులకు, ఎల్​అండ్​టీ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. వాహనాల రాకపోకలను హైదరాబాద్-బెంగళూరు రహదారి వైపు మళ్లించారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.