ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ ఉద్యోగులను కించపరిచే విధంగా మాట్లాడారని నిరసిస్తూ ఉద్యోగులు మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కింది స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నా... ఈ విధంగా మాట్లాడడం బాధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తే పూర్తిస్థాయిలో రైతులకు, గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు.
ఇవీ చూడండి: 'అల్పాహారంలో బొద్దింక.. హోటల్ సీజ్'