మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఆర్ఓబీ పనులపై ఈటీవీ భారత్, ఈనాడులో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. ఆర్ఓబీని రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్ఓబీ నిర్మాణ పనులను మరింత వేగంవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుని ముందుకు సాగాలన్నారు.
10న కథనాలు..
ఈనెల 10న ఈనాడులో వచ్చిన 'దేవరకద్ర ఆర్ఓబీకి అడుగడుగునా ఆటంకాలు ' అనే శీర్షికతో, 11న ఈటీవీ భారత్ లో 'పూర్తికాని కష్టాలు' శీర్షికతో కథనం ప్రసారమైంది. అందుకు స్పందించిన అధికారులు శనివారం క్షేత్ర స్థాయిలో ఆర్ఓబీ నిర్మాణం పనులను పరిశీలించారు. సర్వీస్ రోడ్డు వేసి వాహనదారులు ఇబ్బందులను తొలగించాలని రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ సతీష్ అధికారులకు ఆదేశించారు.
స్లాబ్ నిర్మాణం పనుల వేగాన్ని పెంచి నెలకు 5 స్లాబ్లను పూర్తి చేయాలన్నారు. అవసరమైన చోట మిగతా నిర్మాణం పనులను ప్రారంభించి... నాణ్యతలో రాజీ పడకుండా అధికారులు నిరంతరం నిర్మాణం పనులను పరిశీలించాలని సూచించారు. సీఈ వెంట, ఎస్ఈ నర్సింగ్, ఈఈ కేవీఎన్ స్వామి, డీఈ సంధ్య, ఏఈ కౌశిక్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి: పూర్తికాని ఆర్ఓబీ పనులు.. తప్పని ప్రయాణికుల కష్టాలు