మహబూబ్‌నగర్ 41వ వార్డు పరిధిలోని 198వ పోలింగ్ కేంద్రంలో రేపు రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ తెలిపిపారు. రెండు టెండర్ ఓట్లు నమోదైనందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రీ పోలింగ్ జరపనున్నట్లు వివరించారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇప్పటికే ఓటర్లందరికి పోలింగ్ స్లిప్పులు అందించామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. బాధ్యులపై విచారణ జరిపి నివేదిక ఆధారంగా... పీవో, ఏపీవో, ముగ్గురు వోపీవోలను సస్పెండ్ చేసినట్లు వివరించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: ఈ నెల 27న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నిక