మహబూబ్నగర్ జిల్లాలోని మన్యంకొండలో కొలువైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ప్రారంభం కానున్న వేళ... ఆలయం పూర్వవైభవం సంతరించుకుంటోంది. కొన్నేళ్లుగా శిథిలావస్థకు చేరిన కోనేరును... పునర్మించేందుకు ఓ దాత ముందుకొచ్చారు. కోనేటి చుట్టూ రాతిగోడ, శిథిలమైన మెట్లను నిర్మించారు. మరికొంత మంది దాతలు ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఆలయ చరిత్రలో ఒకటైన హనుమద్దాసుల వారి కోనేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 200 ఏళ్ల క్రితం మునుల కొండలో హనుమద్దాసు తపస్సు చేస్తూ... భక్తుల సౌకర్యార్థం కోనేటిని తవ్వించాడు. తవ్వించిన ఆ కోనేటిలో బండరాయి తప్ప నీటి చుక్క రాలేదు. వారం రోజుల పాటు ఒంటి కాలుపై కఠిన దీక్షతో హనుమద్దాసు తపస్సు చేయగా.. కోనేటిలోని బండ పగిలి గంగ ప్రవహించిందని పూర్వికుల కథనం.
ఇదీ చూడండి : కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం