మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి ఉత్సవాలలో మరో ప్రధాన ఘట్టమైన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
భక్తులు గోవింద నామస్మరణ, భజన చేస్తూ ముందుకు సాగగా, యువకులు శ్రీరామ అంటూ రథం లాగారు. మహిళలు, యువతులు కీర్తనలు ఆలపిస్తూ రథోత్సవంలో పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహించిన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం ముగియగా ఉత్సవాలు ముగిసినట్లు నిర్వాహకులు తెలిపారు.