RAHUL GANDHI JODO YATRA: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదో రోజు పాదయాత్ర ప్రారంభించే ముందు జైరాంరమేశ్‌తో కలిసి శిబిరం ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ కార్యక్రమంలో రాహుల్ ఆడి పాడారు. జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపం నుంచి ప్రారంభమైన యాత్ర.. హైదరాబాద్-బెంగళూర్ 44వ జాతీయ రహదారిపై సాగింది.
పాదయాత్ర చేస్తూ రహదారి గుండా వెళ్తున్న వారికి అభివాదం చేస్తూ రాహుల్ ముందుకు సాగారు. తన కోసం రహదారి వెంట ఎదురు చూస్తున్న చిన్నారులు, యువతి, యువకులు, మహిళలను పిలిపించుకుని మరీ ఫోటోలు దిగారు. రాహుల్ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు పాల్గొన్నారు.
జాతీయ రహదారి వెంట రాజపూర్ మండలం కేంద్రం మీదగా బాలానగర్ మండలం పెద్దాయిపల్లి వరకు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర తిరిగి ప్రారంభమై రంగారెడ్డి జిల్లాల్లోకి ప్రవేశించనుంది. షాద్‌నగర్ సమీపంలోని సోలీపూర్ వద్ద నిర్వహించే కూడలి సభలో రాహుల్‌గాంధీ ప్రసంగించనున్నారు.
ఇవీ చదవండి: