ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని... పీఆర్టీయూ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు నారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. 2018 నుంచి ఇప్పటి వరకు పీఆర్సీ ప్రకటించలేదని, వెంటనే 11వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు 45 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించి అర్హులైన ఉపాధ్యాయులందరికి పదోన్నతులు కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: స్థలం కబ్జా అయిందని 70 ఏళ్ల బామ్మ ఆందోళన