ETV Bharat / state

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సన్నాహక ర్యాలీ - కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ మహబూబ్​నగర్​

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రవాణా చట్టానికి నిరసనగా ఈ నెల 26న చేపట్టే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక నేతలు కోరారు. సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా మహబూబ్​నగర్​లో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిల భారత సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రవాణా రంగంలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గోనున్నాయని స్పష్టం చేశారు.

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సన్నాహక ర్యాలీ

author img

By

Published : Nov 20, 2020, 7:11 PM IST

నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వివిధ ట్రేడ్‌ యూనియన్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు సన్నాహక ర్యాలీ నిర్వహించారు. రోడ్లు భవనాల అతిథి గృహం నుంచి తెలంగాణ కూడలి వరకు ర్యాలీ చేపట్టిన కార్మిక రంగ సంస్థల నేతలు నిరసన తెలిపారు.

కార్మికుల జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో ఉందని.. కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలకు నిరసనగా అఖిల భారత సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రవాణా రంగంలోని అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గోనున్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికే కొవిడ్‌ దృష్ట్యా తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నామని.. ఆన్‌లాక్‌ 5.0లో ఉన్నా కోలుకోలేకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కొత్త చట్టం కార్పొరేటర్లకు మేలు చేసి పేద, మధ్య తరగతి కుటుంబాలను వీధిన పడేస్తుందని.. కేంద్రం ప్రవేశపెడుతున్న రవాణా చట్టం ద్వారా వాహన రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని మండిపడ్డారు. 2019 రవాణా చట్టాన్ని సవరణ చేయాలని, కార్మిక వ్యతిరేక కోడ్‌లను రద్దు చేయాలని, రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అసంఘటిత రవాణా కార్మికుల కోసం సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఈ నెల 26న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేస్తామన్నారు.

ఇదీ చదవండి: 'దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.