మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అద్దె బస్సుల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రైవేట్ బస్సుల యజమానులు జిల్లా కేంద్రంలోని రీజనల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు బస్సుల అద్దెలు చెల్లించడం లేదని బస్సుల యజమానులు వాపోయారు. ఒప్పందం ప్రకారం తమకు బిల్లులు మంజూరు చేయకపోడం వస్స బస్సుల నిర్వహణ ఖర్చులతో పాటు డ్రైవర్లకు చెల్లించాల్సిన జీతభత్యాలు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులకు, ఫైనాన్స్‌లకు చెల్లించాల్సిన వాయిదాలు పెండింగ్‌లో ఉండిపోతున్నాయంటూ..ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులను మంజూరు చేయాలని రాష్ట్ర స్థాయిలో అధికారులను కోరినా స్పందన కరువైందని, గత నాలుగు నెలలుగా బస్సుల నిర్వహణ భారమై నడపలేని పరిస్థితిలో ఉన్నామని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని కోరారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!