ETV Bharat / state

జీఓ నెం.203పై బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ - pothireddypaadu project]

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నెం.203పై మహబూబ్ నగర్​ డీసీసీ ఆధ్వర్యంలో బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి పాలమూరు ఎలా ఎడారిగా మారనుందనే అంశంపై చర్చించనున్నారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో  ఉమ్మడి పాలమూరు ఎడారే : సంపత్

author img

By

Published : May 26, 2020, 5:15 PM IST

పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెంబర్ 203 వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారనుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. ఈ అంశం వివరించేందుకు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎలా అన్యాయానికి గురవుతోందో ప్రజలకు వివరిస్తామని వెల్లడించారు.

పీపీటీ చర్చకు ఉత్తమ్, భట్టి...

కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి సహా భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు జరిగే అన్యాయంపై ప్రజంటేషన్​లో కూలంకషంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. 203 జీఓ వల్ల పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల వద్ద జూన్ 2న దీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు.

మంత్రులూ ! రాజీనామా చేయండి

పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుపై విడుదల చేసిన 203 జీఓ పట్ల సీఎం కేసీఆర్ వైఖరిని సంపత్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అన్ని పార్టీలు కలిసి పోరాటం చేద్దామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను ఆయన స్వాగతించారు. 203 జీఓకు వ్యతిరేకంగా ఒక్క అడుగూ ముందుకు పడలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే... జిల్లా మంత్రులిద్దరూ రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.