ETV Bharat / state

ప్రధాని దృష్టిని ఆకర్షించిన 'తిమ్మాయిపల్లి'

నీటి సంరక్షణ చర్యల్లో చేసిన విశేష కృషికి తిమ్మాయిపల్లి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.  ఆదివారం జరిగిన తన మన్​ కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా సాక్షాత్తు ప్రధాని మోదీ తిమ్మాయిపల్లిపై ప్రశంసల జల్లు కురింపించారు.

ప్రధాని దృష్టిని ఆకర్షించిన 'తిమ్మాయిపల్లి'
author img

By

Published : Jul 2, 2019, 5:17 PM IST

Updated : Jul 3, 2019, 3:11 AM IST

ప్రధాని దృష్టిని ఆకర్షించిన 'తిమ్మాయిపల్లి'

దేశంలో అనేక మహా నగరాలు, పట్టణాలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలపై కథనాలు పత్రికల్లో వస్తున్నాయి. నీరు లేకపోతే మానవ మనుగడ కష్టమని తెలిసినా జల సంరక్షణను నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాం. నీటిని నిల్వ చేసుకొనే అవకాశాలున్నా.. సద్వినియోగం చేసుకోలేకున్నాం. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా అనేక పథకాలను అమలు చేస్తోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలోని తిమ్మాయిపల్లి 500 జనాభా ఉన్న చిన్న తండా. ఇటీవలే ఈ తండా గ్రామ పంచాయతీగా మారింది. మూడేళ్ల కిందట ఈ గ్రామంలో తవ్విన నాలుగు ఊట కుంటల పరిధిలో నేడు 80 రైతు కుటుంబాలు 200 ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేసుకొంటున్నాయి. ఇదే గ్రామస్థులు సమీపంలోని మద్దిమోనిగుట్ట చుట్టూ సుమారు రెండు వేల కందకాలు తవ్వారు. గుట్టపై పడిన నీరంతా ఈ కందకాల్లో చేరి భూమిలోకి ఇంకడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. చుట్టూ కరవున్నా ఆ గ్రామంలో బోర్లు నీటితో కళకళలాడుతున్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద గ్రామస్థులు ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో తాగు, సాగు నీటి ఇబ్బందులకు చక్కటి పరిష్కారం కనుగొన్న తిమ్మాయిపల్లి తండా నేడు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి దృష్టిని ఆకర్షించి, జాతీయస్థాయి గుర్తింపు పొందింది. ఆదివారం తన ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యావత్‌ దేశం మొత్తానికి తిమ్మాయిపల్లి గురించి వివరించారు. ఆ గ్రామ ప్రజల కృషిని ప్రశంసించారు.

‘ ' భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని చెబుతుంటే వింటూ ఉంటాం. ఆ నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనకు లేదా? జల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కాదా! ’
- నరేంద్ర మోదీ, దేశ ప్రధానమంత్రి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సంరక్షణకు ఎన్నో పథకాలు ఉన్నాయి. ఊట కుంటలను నిర్మించడానికి రూ.4 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. నీటికుంటల నిర్మాణానికి రూ.60 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు, చెక్‌డ్యాంలను నిర్మించడానికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీటిని ఉపాధిహామీ పథకం కింద ఉచితంగా నిర్మిస్తారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వర్షపునీటిని నిల్వ చేయడానికి చర్యలు తీసుకొంటున్నాం. గత వేసవికాలం నుంచే ఈ పనులను మొదలుపెట్టాం. కూలీలకు కొంత ఇబ్బంది ఉన్నా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పూర్తిగా దృష్టి సారిస్తున్నాం’ - డీఆర్‌డీవో విక్రంరెడ్డి

ఒక్కరి చొరవతో పది మందికి ఉపాధి

మా నాన్న లచ్చనాయక్‌ ధైర్యంగా ముందుకు వచ్చి మాకున్న పొలంలో రెండెకరాలు కేటాయించి ఉపాధి హామీ కింద ఊటకుంట నిర్మించారు. భూగర్భ జలాలు పెరిగి బోరులో పుష్కలంగా నీరు వస్తోంది. బీడువారిన తొమ్మిది ఎకరాలను సాగు చేసుకొంటున్నాం. - గోపాల్‌నాయక్‌, తిమ్మాయపల్లి తండా

వలసలకు అడ్డుకట్ట

మా గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద 2016 లో నాలుగు ఊటకుంటలు నిర్మించాక భూగర్భ జల మట్టం పెరిగింది. పాడుబడిన బోర్లు సైతం నీరందిస్తున్నాయి. గతంలో ముంబయి, పుణె, హైదరాబాద్​ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా గ్రామానికి తిరిగివచ్చి వ్యవసాయం చేసుకొంటున్నారు.

- పెంటు నాయక్‌

Intro:TG_ADB_31_02_UDYOGULA NIRASANA_VO_TS10033..
సార్ సాల ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని నిరసన..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సార్ చాలా ఘటన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్మల్ జిల్లా టీ ఎన్జీవో ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ తమ కార్యాలయాలను నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోనేరు కృష్ణ వ్యతిరేకంగా నినాదాలు చేశారు .అనంతరం నాయకులు మాట్లాడుతూ విధుల నిర్వహణలో భాగంగా అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళితే దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకోవాలని కోరారు. అప్పుడే ఉద్యోగులకు భద్రత కలుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
బైట్ ప్రభాకర్
నిర్మల్ టిఎన్జీవో సంఘం అధ్యక్షులు

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ హిట్ నెంబర్ 714
Last Updated : Jul 3, 2019, 3:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.