ETV Bharat / state

Medicine Prices Hike : మందులు మరింత భారం.. ఆందోళనలో జనం

Medicine Prices Hike : పెరిగిన ఇంధన, నిత్యావసరాల ధరలతో ఇప్పటికే జనం అతలాకుతలం అవుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవల ఔషధాల ధరలు ఎగబాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కేంద్రం కొన్ని రకాల మందులపై 12 శాతం ధరలు పెంచింది. మల్టిపుల్‌ కాంబినేషన్‌ మందుల ధరల్ని కూడా తయారీ సంస్థలు పెంచడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

Hike Medicine Prices
Hike Medicine Prices
author img

By

Published : Apr 24, 2023, 9:53 AM IST

'ఔషధాలపై 12 శాతం ధరలు పెంచిన కేంద్రం'

People Are suffering Due To Medicine Prices Hike : ఆహారపు అలవాట్లు, జీవనశైలి, కాలుష్యం వంటి కారణాలతో ఇప్పటికే ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు.. మందులు వాడుతూనే ఉంటారు. క్రమం తప్పకుండా ఔషధాలు వాడే వారికి, ఆసుపత్రుల్లో చేరిన ఇన్‌ పెషెంట్లకు.. పెరిగిన మందుల ధరలు భారంగా మారుతున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 857 రకాల మందులపై 12 శాతం ధరల్ని పెంచుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కొన్ని కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించాయి.

10 నుంచి 20 శాతం ఔషదాల ధరలు పెరిగాయి: దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి నెలకు రూ.1000 అయ్యే ఖర్చు.. ఇప్పుడు రూ.1200ల వరకు పెరిగింది. రోగుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. వైద్యులు ఎక్కువగా మల్టిపుల్‌ కాంబినేషన్‌ మందులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీటిపైనా 10 నుంచి 20 శాతం ధరలు పెరగటం వినియోగదారులకు భారంగా మారుతోంది. రక్తపోటు, మధుమేహం, కిడ్నీ, గుండె, శస్త్రచికిత్సలో వినియోగించే ఔషధాల ధరలు పెరిగాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా గుర్తింపు పొందిన ఔషధ దుకాణాలు, 322 మెడికల్‌ ఏజెన్సీలు ఉన్నాయి.

Medicine Prices Increased From April 1: వీటిలో దాదాపు రోజూ 70 నుంచి 80 లక్షల విలువైన మందుల అమ్మకాలు జరుగుతాయి. సుమారు నెలకు రూ.36 కోట్ల మందుల వ్యాపారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుతుంది. పెరిగిన ధరలతో నాలుగున్నర కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుతానికి ఉన్న నిల్వలను పాత ఎంఆర్​పీ ధరలకే విక్రయిస్తున్నారు. పూర్తిస్థాయిలో కొత్త మందులు బహిరంగ మార్కెట్‌లోకి వస్తే వినియోగ దారునిపై ధరల ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుంది. పెరిగిన ధరల వల్ల దుకాణాల్లో కాకుండా ఆన్‌లైన్‌లో రాయితీపై మందుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

బీపీ, షుగర్ మందుల ధరలు పెరిగాయి. కాఫ్ సిరప్స్, ఎన్​జీఎం సిరప్స్, ఇన్సూలిన్ డ్రగ్స్​కి 20 నుంచి 25 శాతం అధికమయ్యాయి. ఉమెన్ మిస్టర్డ్ అనే డ్రగ్ డయాబెటిస్ రెంజ్​లో ఇన్సూలిస్​కి వాడతారు. అది ఒకప్పుడు రూ.140 నుంచి రూ.145 దాకా ఉండేది. ఈరోజు అదే రూ.185 అయింది. అంటే డ్రగ్స్​పై 20 నుంచి 25 శాతం రేటు అనేది పెరగటం జరిగింది. -మెడికల్ షాప్​ యాజమాన్యం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.