Palamuru University students dharna : పాలమూరు విశ్వవిద్యాలయంని వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు. గేటు మూసివేసి విశ్వవిద్యాలయ ఆచార్యులు, సిబ్బంది, విద్యార్ధులు క్యాంపస్లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
వసతి గృహాల్లో ఒక్కో గదిలో ఆరు నుంచి ఏడు మంది విద్యార్థినులు ఉంటున్నారని... కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందోనని తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరోగ్య కేంద్రం ఉన్నా.. వైద్యులు, మందులు ఉండకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. వీటికి తోడు ఫీజులు పెంచారని మండిపడ్డారు. ఉప కులపతి రావాలని... తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు.
క్యాంపస్లో విద్యార్థునులకు సరైన క్రీడా ప్రాంగణం లేదు. హాస్టల్లో ఒక్కో గదిలో ఏడు నుంచి తొమ్మిది మందిమి ఉంటున్నాం. ఓ వైపు కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తరగతి గదుల్లో భౌతికదూరం పాటించాలని.. మాస్కు వేసుకోవాలని అంటున్నారు. మరి హాస్టల్స్లో ఒక్కో రూంలో ఇంత మందిని ఎలా పెడుతున్నారు. కరోనా కాలమని చెప్పి ఫీజులు పెంచారు. మరి ఆదాయంలేని రోజుల్లో ఈ ఫీజులను ఎలా చెల్లించాలి. ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయమో.. ప్రైవేటు యూనివర్శిటినో తెలియడం లేదు. ప్రాంగణంలో విద్యార్థునులకు అరకొర వసతులు ఉన్నాయి. - విద్యార్థిని
ఇదీ చూడండి: shilpa chowdary cheating case: శిల్పాచౌదరికి మరోరోజు కస్టడీ.. అనుమతిచ్చిన ఉప్పర్‌పల్లి కోర్టు