ETV Bharat / state

palamuru rangareddy project : బండరావి'పాకులాట ఇంకెన్నాళ్లు'.. పరిహారం వచ్చేదెన్నడు..?

palamuru rangareddy project Residents problems : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఎత్తిపోసేందుకు ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. కానీ అదే ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసిన నిర్వాసితుల సమస్యలను మాత్రం గాలికొదిలేసింది. ఏదుల జలాశయం కింద ముంపునకు గురవుతున్న బండరావిపాకుల గ్రామంలో పరిహారం చెల్లింపులు, పునరావాస కల్పనలో జాప్యం కారణంగా 25శాతం జనాభా ఇప్పటికీ ముంపులోనే నివసిస్తోంది. కొత్తబడి నిర్మాణం జరగక ప్రాథమికోన్నత పాఠశాల ముంపు గ్రామంలోనే నడుస్తోంది. పునరావాస కేంద్రంలోనైనా సరైన వసతులు కల్పించారా అంటే అదీ లేదు. సీసీరోడ్లు లేవు. స్తంబాలు నాటి విద్యుత్ తీగల్ని అమర్చలేదు. ఇంటింటికీ కుళాయిచ్చినా. నీటిసరఫరా సరిపడా లేదు. కోల్పోయిన ఖాళీస్థలాలకు ఇప్పటికీ పరిహారం రాలేదు. చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల పునరావాస కష్టాలపై ఈటీవీ భారత్‌ కథనం.

works Delay
works Delay
author img

By

Published : Jul 13, 2023, 9:20 AM IST

ముంపు గ్రామాలకు పరిహారం, పునరావాస కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం

Bandaravipakula Village Problems : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ఆగస్టు నాటికి ఉదండపూర్ వరకూ నీళ్లు ఎత్తిపోయాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులు చేపడుతోంది. కానీ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపులు, పునరావాస కల్పన విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామం.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఏదుల జలాశయంలో ముంపుకు గురవుతోంది.

palamuru rangareddy project Residents problems : జలాశయం నిర్మాణం దాదాపుగా పూర్తికాగా... ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. వానాకాలంలో వరద పెరిగినా, జలాశయంలో నీళ్లు నింపాలని ప్రభుత్వం నిర్ణయించినా.... బండరావిపాకుల ముంపునకు గురికాక తప్పదు. అయినా ఇప్పటికీ ఆ గ్రామం ఖాళీ కాలేదు. 25శాతం జనాభా ముంపు గ్రామంలోనే నివసిస్తున్నారు. చెల్లించాల్సిన పరిహారం, పునరావాసం పూర్తిస్థాయిలో అందకపోవటంతో దిక్కుతోచనిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు.

అందని పరిహారాలు : బండరావిపాకులలో 494 ఇళ్లు ముంపునకు గురవుతుండగా.... 978 కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.12.54లక్షలు, 18ఏళ్లు పైబడి వివాహం కానివారికి రూ.5లక్షల చొప్పున రూ.102 కోట్ల పరిహారం చెల్లించారు. కానీ సర్వేలో పేరు రానివాళ్లు, 18 ఏళ్లు నుండి పరిహారం రాని వాళ్లు ఇంకా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు. 978కుటుంబాలు నిరాశ్రయులవుతుండగా, 494ఇళ్లకు మాత్రమే పునరావాసం కింద తిరిగి ఇళ్ల స్థలాలు కేటాయించారని.... ఇళ్లకు పరిహారం చెల్లించి, ఖాళీస్థలాలకు ఇవ్వలేదని వాపోతున్నారు. పరిహారం అంచనాల్లోనూ అవకతవకలు జరిగాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

ముంపుకు గురయ్యే గుడిసెలు, రేకుల ఇళ్లకూ పరిహారం అందినా.... అరకొర పరిహారంతో కేటాయించిన స్థలంలో ఇళ్లు నిర్మించుకోలేని దుస్థితి. దీంతో ముంపులో ఉండలేక, పునరావాస గ్రామానికి వెళ్లలేక, ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్లలోనే పలు కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. ముంపు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. మంచి నీళ్లు.... మరుగుదొడ్లు లేవు. మధ్యాహ్న భోజనం కూడా అందుబాటులో లేదు. ముంపు గ్రామం కావడంతో అక్కడి సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పునరావాస గ్రామంలో కొత్త పాఠశాల నిర్మించాల్సి ఉన్నా...అది జరగలేదు. దీంతో పునరావాస గ్రామానికి తరలి వెళ్లిన 30కి పైగా విద్యార్ధులు బస్సులో వచ్చి పాత గ్రామంలోనే చదువుకోవాల్సి వస్తోంది. విద్యార్ధుల సంఖ్య కూడా పడిపోయింది. జలాశయంలోకి నీరు చేరితే ఈ ఏడాది ఆ పాఠశాల నడవడం కూడా కష్టంగానే మారింది.

"ఇంకా కొంత మందికి ఫ్లాట్లు రావాలి. డబ్బులు రావాలి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్లాటు, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఏవీ ఇవ్వడం లేదు. ఇప్పుడు నీళ్లు వదులుతాం అంటున్నారు అలా చేస్తే మా ఇళ్లు అన్ని మునిగిపోతాయి. ప్రభుత్వం నుంచి ఏదైనా పరిహారం వస్తే మేము ఇల్లు కట్టుకుంటాం." - బాధితులు

రోడ్లు, కరెంటు లేక ఇబ్బందులు : పునరావాస గ్రామంలో ఇప్పటికీ ప్రధాన రహదారులు, సీసీ రోడ్లు నిర్మించనే లేదు. మిషన్ భగీరధ కింద ఇంటింటికీ కుళాయిలు అమర్చినా నీటి సరఫరా సక్రమంగా లేదు. విద్యుత్ స్తంభాలు అమర్చి, తీగలివ్వకుండా వదిలేశారు. గ్రామ పంచాయతీ, పల్లెదవాఖాన, పశువైద్యశాల, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు పూర్తి కాగా.. పాఠశాల, బస్ షెల్డర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పాత ఊళ్లోని గ్రామదేవతలు, దేవాలయాల్ని కొత్త ఊరికి తరలించలేదు. ఇంటికో ఉద్యోగం, ఏదుల జలాశయంలో చేపలు పట్టుకునేందుకు లైసెన్సులు ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదు. అన్ని వసతులు కల్పించి ఆదుకోవాలని నిర్వాసితులు కోల్పోతున్నారు.

"ఇక్కడ పాఠశాలలో 54 మంది విద్యార్థులున్నారు. అందులో ఊళ్లో నుంచి వచ్చేది కేవలం 15మంది విద్యార్థులే. వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైన సీలింగ్‌ పెచ్చులు ఊడి కింద పడతాయి. ఇప్పుడు నీళ్లు వదిలితే స్కూల్లోకి కూడా నీరు వస్తాయి." - పాఠశాల ఉపాధ్యాయుడు

కోట్లు మంజూరైనా పనుల్లో జాప్యం : బండిరావిపాకుల పునరావాస గ్రామానికి రోడ్లు, భవనాల నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు కాగా.. ప్రస్తుతం రూ.3 కోట్ల పనులే పూర్తయ్యాయి. ఇదే విషయంపై అధికారులను ఈటీవీ భారత్‌ వివరణ కోరగా... వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.

"వవపర్తి జిల్లాలో మూడు గ్రామాలకు పునరావాసం అభివృద్ధి పనుల చేపడుతున్నాం. బండిరావిపాకులలో పంచాయతీ, వెటర్నిటి ఆసుపత్రి ఉన్నాయి. రోడ్ల నిర్మాణానికి 16కోట్లు రూపాయలు మంజూరయ్యాయి. దాదాపు రోడ్లు నిర్మాణం పూర్తి కావడానికి వచ్చింది." - మల్లయ్య, ఈఈ, రోడ్లు భవనాల శాఖ, వనపర్తి

ఏదుల జలాశయం కింద కొంకలపల్లి గ్రామం సైతం ముంపునకు గురికాగా.. అక్కడ పునరావాస గ్రామంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.13 కోట్ల పనులకు భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. రోడ్లు, మురికి కాల్వల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ద్వారా వీలైనంత త్వరగా నీళ్లు ఎత్తిపోయాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. నిర్వాసితుల సమస్యలనూ పట్టించుకోవాలని బాధితులు కోరుతున్నారు.

ఇవీచదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.