ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కొందరు నేతలు వేస్తున్న కేసులను వాదించవద్దంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను కోరుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా న్యాయవాదులు లేఖ రాశారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తుంటే...కొందరు రాజకీయ నాయకులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అడ్డుపడవద్దని పాలమూరు ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నట్లు న్యాయవాదులు లేఖలో తెలిపారు.
ఇవీ చూడండి:సీఎంకు ఎన్నికల నియమావళి పట్టదా?