ETV Bharat / state

గిన్నిస్​ బుక్​ రికార్డు కోసం కోటి విత్తన బంతుల కార్యక్రమం

author img

By

Published : Jul 9, 2020, 7:35 AM IST

పాలమూరు జిల్లాలో కోటి విత్తన బంతులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనుషులతో పాటు డ్రోన్​ల ద్వారా ప్రభుత్వ భూముల్లో వీటిని వేయనున్నారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

one crore seed balls program for the Guinness Book of Records in mahabubnagar
గిన్నిస్​ బుక్​ రికార్డు కోసం కోటి విత్తన బంతుల కార్యక్రమం

మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రభుత్వ భూముల్లో కోటి విత్తన బంతులు వేసే కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మహబూబ్​నగర్ పట్టణం వీరన్నపేట సమీపంలోని ప్రభుత్వ భూముల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి వెంకట్రావు వెల్లడించారు.

9 రోజుల్లో కోటి విత్తన బంతులు..

ఆరోవిడత హరితహారంలో భాగంగా మహబూబ్​నగర్​ జిల్లాలో కోటి మొక్కలు నాటడంతో పాటు.. కోటి విత్తన బంతులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో 9 రోజుల్లో కోటి విత్తన బంతుల తయారీని పూర్తి చేశారు.

మనుషులతో పాటు రెండు డ్రోన్​ల ద్వారా నేడు ఈ విత్తన బంతులను విసరనున్నారు. రానున్న పది రోజుల్లో ప్రభుత్వ భూములు, అడవుల్లో వీటిని వేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్​రన్ ఇప్పటికే పూర్తి చేశారు.

కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డీఆర్​డీఏ అధికారులు ఆన్​లైన్ ద్వారా నామినేషన్ అప్​లోడ్​ చేసినట్లు సమాచారం.

ఇదీచూడండి: ఆర్టీసీలో బోగస్‌ ఉద్యోగాల పేరిట వల.. రూ.57 లక్షలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.