ETV Bharat / state

ఎఫెక్ట్: కుంట కబ్జాకు రియల్టర్ల యత్నం.. అధికారుల చర్యలు - ఈనాడు-ఈటీవీ భారత్​తో కథనాలతో కుంటను కాపాడిన అధికారులు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధి బూరెడ్డిపల్లి శివారులోని మురుగోని కుంట ఆక్రమించేందుకు... స్థిరాస్తి వ్యాపారులు యత్నించారు. ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు స్పందించిన అధికారులు... కుంటకు సరిహద్దులు ఏర్పాటు చేశారు.

officers protect fond land in jadcharla with etv bhrath stories on grabbing
ఎఫెక్ట్: కుంట కబ్జాకు రియల్టర్ల యత్నం.. అధికారుల చర్యలు
author img

By

Published : Dec 21, 2020, 9:36 PM IST

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పరిధిలో కుంటను కబ్జా ప్రయత్నాలపై ఈనాడు-ఈటీవీ భారత్​లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. తహసీల్దార్ లక్ష్మినారాయణ, చిన్ననీటి పారుదలశాఖ డీఈ రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని బూరెడ్డిపల్లి శివారులో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకొని మూడెకరాల విస్తీర్ణంలో మురుగోని కుంట ఉంది. అది కోట్ల రూపాయల విలువ చేస్తోంది.

కుంట పక్కనే వెంచర్​ వేసిన స్థిరాస్తి వ్యాపారులు... కుంట సరిహద్దులు తొలగించి, ఆక్రమించినట్టుగా గుర్తించారు. కుంట మూడెకరాల విస్తీర్ణంతోపాటు ఎఫ్​టీఎల్​ పరిధి, బఫర్ జోన్​కు పది అడుగుల దూరంలో తిరిగి సరిహద్దులు ఏర్పాటు చేశారు. కుంట పరిధిలో వేసిన మట్టిని తొలగించి... కట్ట, తూము, కాల్వలు ఏర్పాటు చేయాలని వెంచర్​ నిర్వాహకులను ఆదేశించారు. అధికారులకు తెలియకుండా కుంటలో ఎలాంటి పనులు చేపట్టినా, అక్రమించే ప్రయత్నం చేసినా... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీ చూడండి: స్లాట్‌ బుకింగ్‌ లేకుండానే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.