ETV Bharat / state

పూర్తికాని ఆర్​ఓబీ పనులు.. తప్పని ప్రయాణికుల కష్టాలు - telangana news

దేవరకద్రలో చేపట్టిన ఆర్ఓబీ నిర్మాణ పనులకు ఆటంకాలు.. వాహనదారులకు శాపంగా మారాయి. ఓ వైపు మందకొడిగా సాగుతున్న పనులు.. మరోవైపు సర్వీస్ ​రోడ్డు లేకపోవటం.. వెరసి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. మరోవైపు ఇంకో ఏడాది గడిస్తే తప్ప.. ఆర్​ఓబీ నిర్మాణం పూర్తయ్యేలా లేవని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ పనులు పూర్తికాకపోవడానికి కారణాలేంటి..? సమగ్ర వివరాలు..!

Obstacles to ROB construction work at Devarakadra on Hyderabad-Raichur National Highway
పూర్తికాని ఆర్​ఓబీ.. తప్పని ప్రయాణికుల కష్టలు
author img

By

Published : Feb 11, 2021, 3:20 PM IST

హైదరాబాద్ రాయచూరు జాతీయ రహదారిపై దేవరకద్రలో చేపట్టిన ఆర్ఓబీ నిర్మాణ పనులకు అడుగడుగునా ఆటంకాలు కలగడం వాహనదారులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడి పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. మొదట్లో దక్కించుకున్న గుత్తేదారు నిర్లక్ష్యం చేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో మరొకరికి అప్పగించిన ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గడువు ముగిసిన ఇప్పటివరకు సగం పనులు పూర్తి కాలేదు.

ఉమ్మడి రాష్ట్రం ఉండగానే..

మహబుబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణాల మీదుగా జడ్చర్ల నుంచి రాయచూర్ వరకు 167వ జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దేవరకద్ర మీదుగా కాచిగూడ నుంచి కర్నూలు వైపు వెళ్లే రైళ్ల రాకపోకల సమయంలో దేవరకద్రలో రైల్వే గేటు ద్వారా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగకుండా ఉమ్మడి రాష్ట్రం ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్ఓబీ నిర్మాణానికి రైల్వే జాతీయ రహదారుల విస్తరణ సంస్థ సంయుక్తంగా నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుట్టింది. పనులు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ప్రారంభమయ్యాయి.

గుత్తేదారు వదిలేశాడు..

రైల్వే శాఖ గేటుకు ఇరువైపులా 20 మీటర్ల వంతెనను పూర్తిచేసి మిగతా పనులు చేయాల్సిందిగా సూచించింది. సంబంధిత పనులను చేజిక్కించుకున్న గుత్తేదారు వివిధ కారణాలతో పనులు ప్రారంభించి వదిలేశాడు. గడువు ముగిసినా పనులు పూర్తి కాక పోవడంతో గుత్తేదారుపై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉపక్రమించటంతో ఆర్ఓ​బీ నిర్మాణంపై నీలినీడలు అలుముకున్నాయి.

రెండోసారి..

రెండోసారి తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగా.. స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చొరవతో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ.24.67 కోట్లతో నిర్మాణానికి 2018 డిసెంబర్ 24న అనుమతులు ఇచ్చింది. 2020 డిసెంబర్ 24 నాటికి పూర్తి చేయాలని గుత్తేదారుతో రోడ్లు భవనాల శాఖ అగ్రిమెంట్ చేసుకుంది. వివిధ కారణాలతో 2019 ఏప్రిల్​లో నిర్మాణ పనులను ప్రారంభించారు.

వేగం లేదు..

2020 మార్చి నాటికి ఇరువైపులా వంతెన నిర్మాణానికి అవసరమైన 28 పిల్లర్లకు గాను 27 పిల్లర్లను పూర్తి చేశారు. మార్చి 21న కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. కొన్ని రోజులుగా తిరిగి పనులు ప్రారంభించి కొనసాగిస్తున్నా.. ఆశించినంత స్థాయిలో వేగంగా జరగడం లేదు. నిర్మాణ పూర్తికి ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసిపోయింది. మరికొంత గడువు ఇవ్వాలని సదరు గుత్తేదారు ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించినా... ఇప్పటివరకూ ఎలాంటి అనుమతులు రాలేదు. 28 పిల్లర్లపై 30 స్లాబ్​లకు గాను ఇప్పటివరకు కేవలం 5 స్లాబ్​లను పూర్తి చేసి 6వ స్లాబ్ పనులు ప్రారంభించారు.

ఆలస్యంతో ఇవే ఇబ్బందులు

సాధారణంగా దేవరకద్ర మీదుగా రోజుకు 50 కి పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సందర్భంగా గేటు వేస్తుండడంతో ఒక్కో రైలుకు రాకపోకలు నిర్వహించే క్రమంలో 10 నుంచి 40 నిమిషాల పాటు గేటు వేసి ఉంచుతారు. ఇలా రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కరోనా ప్రభావంతో రైళ్ల రాకపోకలు అంతగా లేకపోయినా ఆరోవిల్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో.. సర్వీస్ రోడ్డు వేయకుండానే పనులు చేపట్టడంతో.. ఇరుకైన రహదారిలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

గంటలు ఉండాల్సిందే..

పట్టణంలో సంత నిర్వహించే రోజైన బుధవారం రద్దీ ఎక్కువగా ఉండటంతో మరింత ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఇరుకైన రోడ్​లో ఏదైనా వాహనం నిలిచిపోతే.. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవాల్సిందే. సర్వీస్ రోడ్డు వేసి నిర్మాణ పనులను వేగంగా నిర్వహించాలని వాహనదారులు కోరుతున్నారు. దేవరకద్ర మీదుగా హైదరాబాద్ నుంచి నారాయణపేట, ఆత్మకూరు, మక్తల్ మీదుగా రాయచూరు వైపు వెళ్లే వాహనాలకు, ఇటు వైపు నుంచి హైదరాబాద్​కు మధ్య రాకపోకలు నిర్వహించే గేటు పడినప్పుడల్లా... సుమారు నాలుగు వేల వాహనాలు ఆగిపోవడంతో పాటు ప్రయాణం ఆలస్యంగా సాగుతుంది.

మరో ఏడాది..

మరో ఏడాది గడిస్తే తప్ప.. ఆర్​ఓబీ నిర్మాణం పూర్తయ్యేలా లేవని అధికారులు అంటున్నారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటులో స్థానిక ప్రజా ప్రతినిధులతో అధికారులు సమన్వయం చేసుకొని ఆటంకాలను తొలగిస్తే .. నిర్మాణం ముగిసేవరకు వరకైనా ట్రాఫిక్ సమస్య తీరుతుందని వాహనదారులు సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.