ETV Bharat / state

తరలి వచ్చిన జనం... నిరాశతో వెనుదిరిగిన వైనం - పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు

డీటీసీపీ అనుమతి ఉన్న లే అవుట్లు, వాటిలోని ఇళ్ల స్థలాలు, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరించుకున్న స్థలాలకు మాత్రమే అధికారులు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు సైతం గతంలో బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (బీఆర్‌ఎస్‌) బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం (బీపీఎస్‌) కింద క్రమబద్ధీకరించుకున్న భవనాలను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

non-agricultural-property-registrations-in-old-version-at-mahabubnagar-district
తరలి వచ్చిన జనం... నిరాశతో వెనుదిరిగిన వైనం
author img

By

Published : Dec 22, 2020, 10:05 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దాదాపు 90 రోజుల తరవాత పాత విధానం ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పాత విధానంలో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున జనం తరలి వస్తారని భావించిన యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు సైతం చేసింది. టోకెన్లు, చెక్‌ స్లిప్‌లు అవసరమనుకున్న చోట బయోమెట్రిక్‌ నమోదు కోసం అదనంగా స్కానర్లు, వేలిముద్రల యంత్రాలు సైతం సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఊహించినట్లుగానే జనం ఉమ్మడి జిల్లాలోని సబ్‌ రిజిస్టార్ర్‌ కార్యాలయాలకు ముందుగానే చేరుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వరుస కట్టారు. కానీ డీటీసీపీ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరించుకున్న వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పడంతో సబ్‌ రిజిస్టార్ర్‌ కార్యాలయాల నుంచి జనం నిరాశతో వెనుదిరిగారు. అనుమతులు లేని ఇళ్ల స్థలాలు, భవన నిర్మాణాల రిజిస్ట్రేషన్లు మినహా మిగిలిన అన్ని లావాదేవీలు గతంలోలాగే కొనసాగాయి.

122 దస్తావేజులు నమోదు...

మహబూబ్‌నగర్‌ కార్యాలయంలో సోమవారం 33 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా జడ్చర్ల- 29, నాగర్‌ కర్నూల్‌ - 24, గద్వాల- 13 మక్తల్‌ - 7, కల్వకుర్తి- 5, నారాయణపేట- 5, వనపర్తి - 3, ఆత్మకూరు- 2, కొల్లాపూర్‌-1 చొప్పున దస్తావేజుల రిజిస్ట్రేషన్‌ అయింది. అచ్చంపేట, అలంపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఒక్క లావాదేవీ కూడా నమోదు కాలేదు. నమోదైన వాటిలో సేల్‌ డీడ్‌లు 30 ఉన్నాయి. మిగిలిన 92 దస్తావేజులు రద్దు, సవరణ, తనఖా, తనఖా విడుదల, బహుమతి ఇతర సేవలవి. సోమవారం జరిగిన లావాదేవీలతో రూ.18,19,510ల ఆదాయం రిజిస్ట్రేషన్లశాఖకు సమకూరింది.

అధికారుల పరిశీలన

మహబూబ్‌నగర్‌ సబ్‌ రిజిస్టార్ర్‌ కార్యాలయాన్ని జడ్పీ సీఈవో యాదయ్య పరిశీలించారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరు, చేసిన ఏర్పాట్లను ఆరా తీశారు. నారాయణపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ హరిచందన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. నాగర్‌ కర్నూల్‌ సబ్‌ రిజిస్టార్ర్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, ఆర్డీవో నాగలక్ష్మి పరిశీలించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రాములు డీఎస్పీ యాదగిరి సందర్శించి.. పరిస్థితిని పర్యవేక్షించారు. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కువ మంది ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టత ఇవ్వాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేశారు.

స్లాట్‌ బుకింగ్‌ లేకుండానే..

శనివారం వరకూ స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసేవాళ్లు. సోమవారం నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా సబ్‌ రిజిస్టార్ర్‌ కార్యాలయాలకు వచ్చి అవసరమైన దస్తాల్రు, అనుమతులు చూపించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయడం ప్రారంభమైంది. స్లాట్‌ బుకింగ్‌ విధానంలో కేవలం సేల్‌, గిఫ్ట్‌, మార్టిగేజ్‌కి సంబంధించిన సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు గతంలో అమల్లో ఉన్న 23 రకాల దస్తాల్ర రిజిస్ట్రేషన్లను అందుబాటులోకి తెచ్చారు. స్లాట్‌ బుకింగ్‌ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాపర్టీ టాక్స్‌ ఇండెక్స్‌ నంబర్‌ (పీటీఐఎన్‌) టీపీఐఎన్‌, టాక్స్‌ అసెస్‌మెంట్‌ నంబర్‌ నిక్షిప్తం చేయాలని వెబ్‌సైట్‌ కోరేది. కాని ఇప్పుడా నంబర్లతో కాని, స్లాట్‌ బుకింగ్‌తో కానీ సంబంధం లేకుండా అన్ని దస్తాల్రుంటే నేరుగా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్ఛు ఈ వెసులుబాట్లు వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చినా రిజిస్ట్రేషన్లు ఇంకా ఊపందుకోలేదు.

పాత విధానంలో రిజిస్ట్రేషన్లు

పాత విధానంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారిక లే అవుట్లు, అనుమతి లేని ఇళ్ల స్థలాలు, భవన నిర్మాణాలకు మాత్రం రిజిస్ట్రేషన్‌ చేయడం లేదు. గతంలో అనధికారిక లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగినా.. మళ్లీ వాటిపై క్రయవిక్రయాలు జరగాలంటే ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి. పురపాలిక, విద్యుత్తు శాఖ నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు ఇప్పుడు అడగటం లేదు. ఊహించిన దానికన్నా సోమవారం తక్కువ రిజిస్ట్రేషన్లే అయ్యాయని సబ్​రిజిస్ట్రార్​ ఆంజనేయులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా పాతవిధానంలో 2,536 రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.