చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి పేరు మహ్మద్ అఫమ్. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం షేక్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో టీవీ లేదు. ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కటే ఆన్‌లైన్ పాఠాలకు ఆధారం. కానీ, ఆ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా అందవు. దీంతో గ్రామ శివారులో జొన్నచేనులో కాస్త ఎత్తులో ఏర్పాటు చేసిన మంచెపై కూర్చుని ఇలా పాఠాలు వింటున్నాడు.
మంచి సిగ్నల్ కావాలంటే.. మంచె ఎక్కాల్సిందే!
కరోనాతో విద్యార్థుల పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్‌లైన్ పాఠాలు చెబుతున్నాప్పటికీ... పేద విద్యార్థులకు తిప్పలు తప్పట్లేవు. కొందరి ఇళ్లలో టీవీ సైతం లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్నా... సిగ్నల్స్ లేక.. తంటాలు పడుతున్నారు.
మంచి సిగ్నల్ కావాలంటే.. మంచెపైకే!
చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థి పేరు మహ్మద్ అఫమ్. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం షేక్‌పల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో టీవీ లేదు. ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక్కటే ఆన్‌లైన్ పాఠాలకు ఆధారం. కానీ, ఆ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ సరిగా అందవు. దీంతో గ్రామ శివారులో జొన్నచేనులో కాస్త ఎత్తులో ఏర్పాటు చేసిన మంచెపై కూర్చుని ఇలా పాఠాలు వింటున్నాడు.
Last Updated : Sep 28, 2020, 10:46 AM IST