ETV Bharat / state

Jurala Project : వరణుడు ముఖం చాటేయడంతో.. వట్టిబోతున్న దక్షిణ తెలంగాణ జీవధార

Jurala Project Water Level : దక్షిణ తెలంగాణ జీవధార వట్టిబోతోంది. కృష్ణమ్మ గలగలతో ఇప్పటికే జలకళలాడాల్సిన ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. పాలమూరు వరప్రదాయిని జూరాలలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోగా.. ఇక్కడి నుంచి ఎత్తిపోయాల్సిన నెట్టెంపాడు, బీమా, ఇతర ప్రాజెక్టుల్లో పరిస్థితి దయనీయంగా మారింది. నైరుతీ మీద ఆశలతో ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసి వేయికళ్లతో ఎదురుచూస్తున్న రైతులు.. నెలన్నర దాటుతున్నా నీటిజాడలేక ఆందోళనకు గురవుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 15, 2023, 12:04 PM IST

వరుణుడు ముఖం చాటేయటంతో వట్టిబోతున్న దక్షిణ తెలంగాణ జీవధార

Jurala Project Water Level : దక్షిణ తెలంగాణకు ఆదెరువు అయిన కృష్ణమ్మ వెలవెలబోతోంది. గతేడాది ఈ సమయానికి ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ.. 2 నెలలు కావొస్తున్నా వరుణుడు కరుణించక నీటిజాడ కనుమరుగవుతోంది. గతేడాది ఈ సమయానికే ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద మొదలుకాగా.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ సారి జులై మధ్యలోకి వచ్చినా.. వరద రావడం లేదు. ఉమ్మడి పాలమూరుకు వరప్రదాయిని అయిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసే వర్షాలతో ఆల్మట్టి నింపుతూ కృష్ణమ్మ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఎగువన రెండు రాష్ట్రాల్లో ఆశించిన మేర భారీ వర్షాలు లేకపోవటం, అక్కడి ప్రాజెక్టులకు ఇప్పటికీ ప్రవాహం లేకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

Jurala Project Water Level News : కృష్ణ, భీమా నదులు కలిసిన తర్వాత వచ్చే ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి జనవరి మొదటి మాసంలో నీటిని విడుదల చేసే నాటికి పూర్తిస్థాయి నీటి మట్టం కలిగి ఉంది. అప్పటి నుంచి నీటి నిల్వ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రాజెక్టు నిల్వసామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.402 టీఎంసీలు మాత్రమే చేరుకుంది. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గద్వాల, అలంపూర్‌లో లక్షా 20వేల ఎకరాలు, ఎడమకాల్వ నుంచి వనపర్తి, కొల్లాపూర్‌, ఆత్మకూరు ప్రాంతాల్లో 60వేల ఎకరాలకు పైగా సాగు నీరందిస్తోంది. కృష్ణా నది ఇతర ఉపనదులు మరో 7నుంచి 9 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంటాయి. జూరాలకు అనుసంధానంగా నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా 1, 2, ఎత్తిపోతల పథకాలతోపాటు పలు తాగునీటి పథకాలు ఉన్నాయి. 80 టీఎంసీల వరద నీటిని తోడిపోస్తే తప్ప ఈ ప్రాజెక్టుల కింద పంటలకు నీరు అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి నేపథ్యంలో ఈ సారి వరద ప్రవాహం లేకపోవటంతో ఆందోళనకు గురిచేస్తోంది.

"జూరాల ప్రాజెక్టులో నీరు వదలడం లేదు పంటలు సరిగ్గా పండడం లేదు. జూరాలపై ఆధారపడిన ప్రాజెక్టు రైతులు చాల మంది ఉన్నారు. కొన్ని రోజులైతే నాట్లు వేసుకోవాలి నీరు లేకపోతే ఎలా వేస్తాం. నీరు లేనప్పుడు రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి ". - బాధిత రైతులు

ఐదారేళ్లుగా జూన్‌ ఆరంభంలోనే వర్షాలు ప్రారంభం కాగా.. ఈ ఏడాది నైరుతి ముఖం చాటేయడంతో వర్షాలు లేక ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాగును నెలరోజుల ముందుకు జరపాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా అవీ సఫలమైనట్లుగా కనిపించలేదు. ఇప్పటికిప్పుడు భారీ వర్షాలు కురిసినా ఎగువనున్న ప్రాజెక్టులు గరిష్ఠస్థాయిలో నిండి.. దిగువకు నీటిని వదిలేందుకు కనీసం 20రోజుల వరకు సమయం పడుతుంది. ఎగువనున్న ప్రాజెక్టుల్లోకి కనీస ప్రవాహం లేని పరిస్థితుల్లో ప్రాజెక్టుల నుంచి కాలువల్లోకి నీళ్లను అధికారులు నిలిపివేశారు. నారుమడులు సిద్ధం చేసుకున్నా.. సాగు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.

ప్రాజెక్టు నిండితేనే సరి లేకపోతే తీరని నష్టం: అల్మట్టి ఈ ప్రాజెక్టును దాటి.. 11.94 టీఎంసీ సామర్థ్యంఉన్న జూరాల నిండితేనే నెట్టెం పాడు, కోయిలసాగర్, సరళాసాగర్ ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. ఆలమట్టి నుంచి ప్రవాహం మొదలైతే గానీ అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. ఎగువ నుంచి వరద ప్రవాహం లేకపోయినా.. వర్షాలు ఇంకా ఆలస్యమైనా పరిస్థితులు కష్టంగా మారుతాయని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.