మహబూబ్నగర్ జిల్లా ధన్వాడలోని గ్రంథాలయానికి కొత్త భవనం నిర్మిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం సంస్థ కార్యదర్శి మనోజ్‌కుమార్‌తో కలిసి ధన్వాడ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్ఢి ప్రస్తుత భవనం స్థితిగతులను వివరించడమే కాకుండా గోడలకు ఏర్పడిన పగుళ్లను చూపించారు. ఇందులోనే గ్రంథాలయాన్ని నిర్వహించడం భద్రతాపరంగా మంచిది కాదన్నారు. ఏకీభవించిన రాజేశ్వర్‌గౌడ్.. గతంలోనే నిర్వహణకు రూ.3 లక్షలు కేటాయించారన్నారు.
భవనం పరిస్థితి బాగా లేకపోవడం వల్ల నిధులను వినియోగించలేదని, త్వరలో సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను తీసుకొచ్చి కొత్తదాని నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రంథాలయాల పునఃప్రారంభంపై ఇంకా స్పష్టత లేదన్నారు. ఒకవేళ మొదలైనా వేరే గదిలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పుష్పలత, గ్రంథపాలకుడు రామ్మోహన్, గోవర్ధన్, బాలకృష్ణ ఉన్నారు.
ఇవీ చూడండి: భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి