ETV Bharat / state

'24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలి'

పంచాయతీ కార్యదర్శి అరుణ్​చంద్ర మృతి చెంది 12 రోజులు గడిచినప్పటికీ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు ప్రశ్నించారు. మహబూబ్​నగర్​ కలెక్టరేట్​లో అరుణ్​చంద్ర మృతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసులో సంబంధం ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు.

author img

By

Published : May 19, 2020, 8:30 PM IST

national sc commission member enquiry
national sc commission member enquiry

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం యారోనిపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్ చంద్ర ఆత్మహత్య చేసుకున్న కేసులో 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు పోలీసు అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో పంచాయతీ కార్యదర్శి మృతిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్ చంద్ర మృతి చెంది 12 రోజులు గడిచినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్ భర్త మృతుడిని వేధించినట్లు ఫోన్ సంభాషణ రికార్డ్ చేయడం జరిగిందని.. వాటన్నిటిని పరిశీలించి ముందుగా సంబంధం ఉన్నవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని సూచించారు.

వ్యవస్థలో మార్పులు రావాలని, ఎట్టి పరిస్థితులలో బాధితులకు న్యాయం చేయాలని ఆయన అదికారులను కోరారు. అంతకు ముందు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు, అరుణ్‌ చంద్ర పని చేస్తున్నటువంటి యారోన్‌పల్లి గ్రామంలో పర్యటించి ఘటనపై విచారించారు. అనంతరం జిల్లా కేంద్రంలో మృతుడి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. దేశంలో ఇంకా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అరుణ్ చంద్ర మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: నన్ను అరెస్ట్ చేస్తారా..పోలీస్ స్టేషన్​లో రచ్చరచ్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.