ETV Bharat / state

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం - నీళ్లొచ్చేనా? పంట పండేనా? - Palamuru lift irrigation

Narayanpet Kodangal Lift Irrigation : ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీరందని మెట్ట ప్రాంతాల అన్నదాతల చిరకాల స్వప్నం నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం. ఆ కలను సాకారం చేయాలని, ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని 2014లో జీఓ జారీ అయినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఎన్నో ఉద్యమాలు, పాదయాత్రలు, బహిరంగ సభలు చేపట్టినా ఫలితం దక్కలేదు. పదేళ్ల పాటు మరుగున పడిన ఎత్తిపోతల అంశం.. ఎన్నికల హామీగా మరోసారి తెరపైకి వచ్చింది

Narayanpet Kodangal Lift Irrigation
Palamuru Ranga Reddy Lift Irrigation Scheme
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 31, 2023, 7:44 PM IST

Updated : Dec 31, 2023, 8:30 PM IST

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం - నీళ్లొచ్చేనా? పంట పండేనా?

Narayanpet Kodangal Lift Irrigation : మరాఠా, కన్నడ రాష్ట్రాల నుంచి పరుగులు తీసే కృష్ణానది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం తంగిడిగి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణలో కృష్ణమ్మ అడుగు పెట్టేది నారాయణపేట జిల్లాలోనే ఆయినా ఈ జిల్లాలోని ఎగువ ప్రాంతాలకు ఇప్పటికీ కృష్ణాజలాలు అందడం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఆ ప్రాంతానికి సాగునీరిస్తామని బీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చినా తొమ్మిదిన్నరేళ్లలో అది అమలు కాలేదు.

ఈ నేపథ్యంలో మరోసారి తెరమీదకు వచ్చిన అంశం నారాయణపేట - కొండగల్ ఎత్తిపోతల పథకం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పథకంతో సాగునీరందించి మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజక వర్గాలను సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఇచ్చిన మాట ప్రకారం ఎత్తిపోతల పథకం చేపట్టాలని మెట్ట ప్రాంత రైతన్నలు కోరుతున్నారు.

Palamuru-Rangareddy: పాలమూరు-రంగారెడ్డిలో సాగునీరే ప్రధాన లక్ష్యం..

Palamuru Ranga Reddy Lift Irrigation Scheme : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకుఅప్పటికే ఉన్న జూరాల, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందుతోంది. కానీ మక్తల్, నారాయణపేట, కొడంగల్‌ నియోజక వర్గాల్లో మెట్ట ప్రాంతాలకు ఈ పథకాల ద్వారా సాగునీరు అందే అవకాశం లేదు. అందుకే భీమా ఎత్తిపోతల పథకంలో భాగమైన భూత్పూరు జలాశయం నుంచి నాలుగు దశల్లో కానుకుర్తి వరకూ నీళ్లెత్తి పోసి అక్కడి నుంచి గ్రావిటీతో దౌల్తాబాద్, కొడంగల్‌ మీదుగా బొమ్మరాస్ పేట వరకూ చెరువులు నింపిలక్ష ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ పథకానికి రూపకల్పన చేశారని స్థానిక నేతలు.

"ప్రాథమిక దశలో జయమ్మ చెరువు ఎత్తిపోతల పథకం కోసం వైయస్​ రాజశేఖర్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిల్​ ర్యాలీ తీసి, వినతి పత్రం ఇచ్చాము. 2005 తర్వాత సీపీఎం పార్టీ ఆధర్వంలో సైకిల్​ యాత్ర చేపట్టాం. ఆ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. దీన్ని కొడంగల్​ వరకు విస్తరించి అమలు చేయాలి. ఆ తర్వాత కొడంగల్​-నారాయణపేట్​ ఎత్తిపోతల పథకంగా మార్చారు. ఏడున్నర టీఎంసీలను ఈ పథకానికి తీసుకొచ్చారు." -వెంకట్రాంరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నారాయణపేట

కొన్ని ప్రతిపాదనల్ని పరిశీలించిన అప్పటి ప్రభుత్వం మొదటి దశలో 133కోట్ల 50లక్షల రూపాయలతో పరిపాలన అనుమతులిస్తూ ఉత్వర్తులు జారీ చేసింది. ఆ నిధుల్లో 3.36 కోట్లు ప్రాథమిక సర్వే కోసం 130.50 కోట్లు భూసేకరణ కోసం కేటాయిస్తూ ఉత్తుర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని అప్పటి గవర్నర్ 2014 మే 23న జీఓ నంబర్- 69 జారీ చేశారు. తొలత పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల వెనక జలాల నుంచి ప్రారంభించాలని భావించారు. నర్వ మండలం ఎల్లంపల్లి మీదుగా నీటిని తోడిపోసుకుని, కోయిల్‌కొండ వద్ద జలాశయం నిర్మించి అక్కడి నుంచి నారాయణపేట - కొడంగల్‌ ప్రాంతాలకు నీళ్లు తరలించాలని అంచనా వేశారు. ముంపు అధికంగా ఉండటంతో దిశ మార్చారు.

Palamuru Rangareddy పాలమూరు రంగారెడ్డిపై ప్రతీకారేచ్ఛతోనే పిటిషన్లు

Narayanpet Kodangal Project : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోనే నారాయణపేట- కొడంగల్ కు నీళ్లందిస్తామన్న కేసీఆర్ సర్కారు ప్రణాళికల్ని స్థానిక ప్రజా సంఘాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాయి. జలసాధన సమితి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకులు భూత్పూరు జలాశయం నుంచి ఆయా మండలాల మీదుగా కొండగల్ వరకూ పాదయాత్ర, బహిరంగ సభలు నిర్వహించి జీవో నెంబర్ 69 ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించారు.

కృష్ణానదికి 150కిలోమీటర్ల ఎగువకు వెళ్లి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తరలించేకన్నా, జీవో నెం. 69 అమలు చేసి ఎత్తిపోతల ద్వారా నికర జలాలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే జీఓ నెంబర్ 69ని అమలు చేస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారంటున్న ప్రజాసంఘాలు వెంటనే ఎత్తిపోతల పథకం అమలు చేయాలని కోరుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపేట- కొండగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి అన్నదాతలను ఆదుకోవాలని మెట్ట ప్రాంత ప్రజల వేడుకుంటున్నారు.

CM KCR Inaugurated Palamuru Rangareddy Project : పాలమూరు గడ్డపై కృష్ణమ్మ పరుగులు.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన కేసీఆర్

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

Last Updated : Dec 31, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.