ETV Bharat / state

కంటైన్మెంట్​ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే - mahabubnagar district news

మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో కంటైన్మెంట్​ ప్రాంతాన్ని శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్​రెడ్డి పరిశీలించారు. కరోనా నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందొద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

mla ala venkateshwar reddy visit containment zone in mahabubnagar district
కంటైన్మెంట్​ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 11, 2020, 3:50 PM IST

మహబూబ్​నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో కంటైన్మెంట్ ప్రాంతాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పరిశీలించారు. కంటైన్మెంట్​ ప్రాంతంలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం, మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి క్రమం తప్పకుండా పాటించాలన్నారు. కరోనాపై ప్రజలు ఆందోళన చెందకూడదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తే ఆ మహమ్మారి దరిచేరదని ఆయన ప్రజలకు సూచించారు.

ఇవీ చూడండి: గాంధీలో కొవిడ్-19 బాధితుని మృతదేహం అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.