ప్రజా ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటేనే అభివృద్ధి సాధ్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.
ఉంద్యాలలో రూ.30 లక్షల నిధులతో సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి భూమి పూజ చేశారు. ప్రభుత్వ పథకాలతో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే అన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రాము, వజీర్ బాబు, సర్పంచ్, పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఒక్క ప్రాజెక్టులోనైనా అవినీతిని చూపించగలిగారా?'