ETV Bharat / state

చెక్​ డ్యాంలో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు - దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్​లో జిల్లాలోని ఓ చెక్​ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.

devarakadra mla aala venkateshwar reddy
చెక్​ డ్యాంలో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు
author img

By

Published : Jul 19, 2020, 10:44 AM IST

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం వర్ని వద్ద 5 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యాంలో గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలు అందులో చల్లి హారతి ఇచ్చారు. నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో 18 చెక్​ డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.

ఊకచెట్టు వాగుపై 9, పెద్ద వాగుపై 9 ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 9 నిర్మాణాలు పూర్తయినట్లు ఆయన వివరించారు. సకాలంలో వర్షాలు కురవడంతో చెక్ డ్యాంలో జలకళ సంతరించుకుందన్నారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెంకటేశ్వర్ చెప్పారు.

ఇవీ చూడండి: 'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.