ETV Bharat / state

రైతు వేదికలతో భవిష్యత్​లో బహుళ ప్రయోజనాలు: నిరంజన్ రెడ్డి

మహబూబ్​నగర్ జిల్లా వెంకటాపూర్​లో నిర్మించిన రైతు వేదికను మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్​ ప్రారంభించారు. పాలమూరును సస్యశ్యామలంగా మార్చుతామని హామీ ఇచ్చారు. రైతు వేదికలను బహుళ ప్రయోజనాలకు వాడుకోవచ్చని తెలిపారు.

ministers niranjan reddy srinivas goud inaugurated rythu vedika in mahabubnagar district
రైతు వేదికలతో భవిష్యత్​లో బహుళ ప్రయోజనాలు: నిరంజన్ రెడ్డి
author img

By

Published : Nov 10, 2020, 8:57 PM IST

భవిష్యత్తులో రైతువేదికలను బహుళ ప్రయోజనాలకు వినియోగిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్​నగర్ జిల్లా వెంకటాపూర్ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను మంత్రి శ్రీనివాస్ గౌడ్​తో కలిసి ఆయన ప్రారంభించారు. మాచన్​పల్లి తండాలో రూ.3 కోట్ల 22 లక్షలతో నిర్మించనున్న 64 రెండు పడక గదుల ఇళ్లకు భూమిపూజ చేశారు. మూసాపేట మండలం వేముల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు. రైతులకు మేలు చేసే సమాచారం, ఆధునిక పద్ధతులు, వ్యవసాయ విధానం, తదితర అంశాలను రైతువేదిక ద్వారా తెలియజేస్తామన్నారు. భవిష్యత్తులో సేద్యం ఎలా ఉండాలో వీటి ద్వారా అవగాహన కల్పిస్తామని, అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకుంటామని వివరించారు.

రైతులకు పాఠాలు

రైతువేదికలో దృశ్య, శ్రవణ మాధ్యమం ఏర్పాటు చేస్తామని, స్క్రీన్లను ఏర్పాటు చేసి రైతులకు ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడి సాధించిన రైతుల విజయగాథలు, ప్రపంచ దేశాలలో వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులు, తదితర అంశాలను అందిస్తామన్నారు. సేద్యంలో అన్నదాతలు ఆధునిక పద్ధతులు పాటించాలని, అవసరమైన మోతాదులోనే ఎరువులు వాడాలని, పెట్టుబడి తగినంత మోతాదులో పెట్టాలని, ఏడాదికి రెండు సార్లు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అన్నదాతలకే పెద్దపీట

కరోనా సమయంలోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేశామని, అన్నదాతల సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అన్నదాతలు వాణిజ్యపరంగా ఆలోచించాలని, ముఖ్యంగా రాష్ట్రంలో 80 శాతం కూరగాయలను బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అవసరమైన కూరగాయలను ఇక్కడే పండిస్తే అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.

పనులు భేష్

వేముల గ్రామంలో నిర్మించిన రైతువేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, పార్క్ బాగున్నాయని... ఇందుకు కృషి చేసిన గ్రామస్థులను ఆయన అభినందించారు. వ్యవసాయ గోదాముల నిర్మాణానికి 5 ఎకరాల స్థలం ఇస్తే రూ.6 కోట్లతో గోదాములు నిర్మించి ఇస్తామన్నారు. సాగునీటి కోసం మినీ లిఫ్ట్ విషయం ఆలోచిస్తామని చెప్పారు. గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరగా డీసీసీబీ ద్వారా ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శాఖను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఏడాదిలోగా...

రైతు వేదికలు గ్రామాలకు దేవాలయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో గ్రామాల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తాగునీరు, సీసీ రోడ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. మాచన్​పల్లి తండాలో చేపట్టిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

సస్యశ్యామలం దిశగా...

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద కరివెన రిజర్వాయర్ పూర్తయితే వేముల ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. ఏడాదిలో ఈ రిజర్వాయర్ పూర్తవుతుందని చెప్పారు. దశలవారీగా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి గ్రామస్థులకు తెలిపారు.

ఇదీ చదవండి: భాజపా గెలుపు... తెరాస ప్రభుత్వానికి చెంపపెట్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.