ETV Bharat / state

'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాం'

ఎవరు అడ్డొచ్చినా... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి మహబూబ్​నగర్ జిల్లా సస్యశ్యామలం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

author img

By

Published : Jul 12, 2019, 8:06 PM IST

'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తాం'

ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ఈరోజు పాలమూరు పట్టణంతో పాటు హన్వాడ మండలం వరకు నీటి కాలువ నిర్మించే ప్రతిపాదిత ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో కలిసి సందర్శించారు. కర్వెన జలాశయం నుంచి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న భూములకు సాగునీరందించే విధంగా ప్రణాళికలను రూపొందించామని... అందుకనుగుణంగా సర్వే కూడా పూర్తయిందని తెలిపారు. ఈ పాటికే ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కావాల్సి ఉండగా... కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. కొందరు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదిఎమైనా పాలమూరు-రంగారెడ్డి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: కిడ్నాప్​ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు

Intro:TG_Mbnr_07_12_Min_Survey_For_Palamoor_Lift_AB_TS10052
కంట్రిబ్యూటర్‌: చంధ్రశేఖర్‌, మహబూబ్‌నగర్‌
ఎన్ని దుష్ఠ శక్తులు అడ్డుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి మహబూబ్‌నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ ముందున్న లక్ష్యమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పునరుద్ఘాటించారు. Body:పాలమూరు పట్టణంతో పాటు హన్వాడ మండలం వరకు నీటి కాలువ నిర్మించే ప్రతిపాధిత ప్రాంతాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులతో పరిశీలించారు. కర్వెన జలాశయం నుంచి మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న భూములకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలను రూపొందించడం జరిగిందని.. అందుకనుగుణంగా సర్వే సైతం పూర్తయిందన్నారు. Conclusion:ఇప్పటికే ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కావాల్సి ఉందని.. కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైందన్నారు. సాగునీరందించి రైతులకు భరోస కల్పించాలని కృషి చేస్తుంటే.. కొందరు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఏదిఎమైనా పాలమూరు-రంగారెడ్డి పనులను వేగవంతం చేసి పూర్తి చేసి పాలమూరును జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు........Byte
బైట్
శ్రీనివాస్‌గౌడ్‌, ఎక్సైజ్‌ శాఖ మంత్రి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.