ETV Bharat / state

'కొవిడ్​ లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోండి' - మహబూబ్ నగర్​లో ఆస్పత్రిలో శ్రీనివాస్

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొవిడ్ బారిన పడితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పరీక్షల నుంచి చికిత్స వరకూ అన్నిరకాల వసతులు పాలమూరులో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. మహబూబ్​నగర్​ ఆస్పత్రిలోని కొవిడ్​ వార్డుని మంత్రి సందర్శించారు.

minister srinivas goud visit mahabubnagar hospital covid ward
'కొవిడ్​ లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోండి'
author img

By

Published : Mar 19, 2021, 9:57 PM IST

ప్రజలు కరోనా బారిన పడితే భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని కొవిడ్ వార్డులో గతంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆయన తనిఖీ చేశారు. రోగులకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దగ్గు, జ్వరం, జలుబు లాంటి లక్షణాలు ఉంటే.. పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. 150 పడకల కరోనా వార్డు, ఆక్సిజన్ ప్లాంటు సహా వైద్యం అందుబాటులో ఉందన్నారు. కరోనా వైరస్​ని ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు ఎస్.వి.ఎస్ ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

'కొవిడ్​ లక్షణాలుంటే వెంటనే టెస్టు చేయించుకోండి'

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోనే 18 వైద్య బృందాలు పనిచేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. హోం క్వారంటైన్​లో ఉండి చికిత్స తీసుకునేందుకు వైద్య బృందాలు సహకరిస్తాయని చెప్పారు. కరోనా లక్షణాలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం, లాంటివి చేయకూడదని కోరారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక వార్డును సుందరీకరించాలని, పూల మొక్కలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా వార్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో 400 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత కలెక్టరేట్ ఆవరణలో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్ రామ్ కిషన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శశికాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా.. రెండ్రోజుల్లో 150కి పైగా కేసులు‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.