మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రజలు వలస పోకుండా.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పర్యటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి.. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో పద్మావతీకాలనీలోని అయ్యప్ప కొండపై మంత్రి శ్రీనివాస్ మహా పడిపూజలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి ఊరేగింపులో పల్లకి సేవ చేశారు. క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చిలో ప్రార్థనకు హాజరై.. క్రైస్తవులకు క్రిస్మస్ శుక్షాకాంక్షలు తెలిపారు. ప్రేమ, శాంతి, కరుణలకు ప్రతిరూపమే యేసుక్రీస్తు అని మంత్రి అభివర్ణించారు. ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో నడవాలని కోరారు.
మహబూబ్నగర్లో కోటి రూపాయల వ్యయంతో క్రైస్తవ భవన్ నిర్మిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ లేకుండా సుఖసంతోషాలతో జీవించాలనే ప్రతి మతం చెబుతోందని అన్నారు.
- ఇదీ చూడండి : తెలంగాణలో వైకుంఠ వైభవం.. పారవశ్యంలో భక్తజనం