తేనెతుట్టె కనిపిస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది.. అందులోని తేనెను జుర్రేయాలనే అనిపిస్తుంది. పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సైతం అదే అనిపించింది కాబోలు.. తేనెతుట్టె కనిపించగానే దాన్ని బయటకు తీసి అందులోని తేనే పిండుకుని ఆ మాధుర్యాన్ని ఆస్వాదించారు. తానే కాదు.. పక్కనున్న జిల్లా ఉన్నతాధికారులకు సైతం రుచి చూపించారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో పట్టణ ప్రగతి ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఖాళీ స్థలాలోని ముళ్లపొదలను జేసీబీతో శుభ్రం చేయించారు. ముళ్ల పొదలు తొలగిస్తుండగా మంత్రికి తేనెతుట్టె కనిపించింది. వెంటనే తేనెటీగలకు భయపడకుండా, తుట్టెను తీసి దాన్ని పిండి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించారు.
ఇదీ చదవండి: KTR: 'గత పాలకులు మాటలు చెబితే.. కేసీఆర్ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోంది'