హన్యాడ - మహబూబ్నగర్ మధ్య వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ నిర్మాణాన్ని చేపట్టనున్నామని... త్వరలోనే భూసేకరణ సైతం పూర్తి చేస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో నియంత్రిత వ్యవసాయంపై తొలుత నియోజకవర్గాలు, క్లస్టర్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి.. రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
క్లస్టర్ స్థాయి రైతు వేదిక భవనాల నిర్మాణానికి భూములు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడైనా.. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి సహకరించినా... కేసులు పెడతామని అన్నారు.
నకిలీ విత్తనాల సమాచారం ఎవరైనా ఇస్తే... వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.. ఎక్కడ నాసిరకం విత్తనాలు అమ్మినా... అధికారులకు తెలియజేయాలని కోరారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించడం ద్వారా రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలన్నదే కేసీయార్ ఉద్దేశమని వివరించారు. జిల్లాలో రైతులు వరి, పత్తి పంటలకు ఎక్కువగా దృష్టి సారించాలని కోరారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించనున్నామని వివరించారు. వానాకాలానికి కావాల్సిన ఎరువులు సిద్ధంగా ఉన్నాయని రైతులు తీసుకువెళ్లాలని కోరారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుబంధు అందేలా రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.
కరోనా లాంటి కష్టం వచ్చినా జిల్లాలో అభివృద్ధి ఎక్కడ ఆగలేదన్న ఆయన నూతన సాగు విధానాన్ని సైతం విజయవంతం చేయాలని కోరారు.
హన్యాడ- మహబూబ్నగర్ మధ్య వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ నిర్మాణాన్ని చేపడుతాం. దీనికి సంబంధించిన భూమిని త్వరలోనే సేకరిస్తాం. జిల్లాల్లో నియంత్రిత వ్యవసాయంపై క్లస్టర్సమావేశాలు నిర్వహిస్తాం.... మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇదీ చదవండి:60 రోజులు వధువు ఇంట్లోనే పెళ్లి బృందం