అహోరాత్రులు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టి కర్షకుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలో కొనసాగుతున్న భారత్ బంద్ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెరాస కార్యకర్తలతో కలిసి రైతులకు మద్దతు తెలిపారు. తెలంగాణ సర్కార్ ఎల్లప్పుడు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి తెరాస నుంచి, తెలంగాణ సర్కార్ నుంచి పూర్తి మద్దతుంటుందని చెప్పారు. కర్షకులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు.
- ఇదీ చూడండి : ఈనెల 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం: కేసీఆర్