ETV Bharat / state

'మహబూబ్​నగర్​ను వలసల జిల్లా కాకుండా చేస్తా' - మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

మహబూబ్​నగర్​ను వలసల జిల్లా కాకుండా చేస్తానని పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హామీ ఇచ్చారు. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

'మహబూబ్​నగర్​ను వలసల జిల్లా కాకుండా చేస్తా'

author img

By

Published : Feb 3, 2020, 10:24 PM IST

'మహబూబ్​నగర్​ను వలసల జిల్లా కాకుండా చేస్తా'

సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా మహబూబ్​నగర్​ జిల్లాను అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్​, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. వలసల జిల్లా కాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

మొత్తం 1,296 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరంలో ఒక్క వెయ్యి 18 మంది పరీక్షలు చేయించుకున్నారు. రికార్డు స్థాయిలో రక్తదానం చేయడం పట్ల మంత్రి అభినందించారు. క్యాన్సర్​ను ఆదిలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసేందుకు చికిత్సలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.

ఇవీ చూడండి: దిశ కేసులో మొదటి రోజు ముగిసిన కమిషన్‌ విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.