మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో వానాకాలం 2020 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల వ్యవసాయ, రైతు బంధు సమితి, మిల్లర్లు, బ్యాంకర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల మేలు కోరి పంట మార్పిడి విధానాన్ని తీసుకొచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు.
మన వద్ద యాపిల్, బంగాళాదుంపలు సైతం పండుతాయని అటువంటి కొత్తరకం పంటలు పండించి దిగుబడి పొంది లాభాలు అర్జించాలని ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందే జిల్లాకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. జిల్లాలో వరి, జొన్నలు, కంది, పత్తి, ఆముదాలను పండించి లాభాలు పొందాలని కోరారు.
ఈ సమావేశంలో మహబూబ్‌నగర్, నారాయణపేట కలెక్టర్లు వెంకట్‌రావు, హరి చందన, జడ్పీ ఛైర్‌పర్సన్లు స్వర్ణ సుధాకర్, వనజమ్మ, మహబూబ్‌నగర్ జడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... జిల్లాలో కలవరం