ETV Bharat / state

ప్రజల శ్రేయస్సే తెరాస లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్ - ప్రజల శ్రేయస్సే తెరాస లక్ష్యం

పురపాలికల ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటుండం వల్ల ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తమ తమ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో తెరాస, భాజపా నేతలు ప్రచారం చేశారు.

Minister Srinivas Goud Election Campaign in Mahabubnagar
ప్రజల శ్రేయస్సే తెరాస లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్
author img

By

Published : Jan 19, 2020, 8:03 PM IST

మహబూబ్‌నగర్ పురపాలిక పరిధిలోని పలు వార్డులలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సుడిగాలి పర్యటన చేశారు. తెరాస చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మరథం పట్టాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పథకాలు అందిస్తూ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా తమ పార్టీ పని చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.

తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే పట్టణాని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతామని హామీ ఇచ్చారు. అటు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపుర్​లో భాజపా నేతలు ప్రచారం నిర్వహించారు. భాజపా నేత ఎర్ర శేఖర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వుకు ఓటు వేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ప్రజల శ్రేయస్సే తెరాస లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్

ఇవీ చూడండి: విరసం కార్యదర్శి కాశీంను హాజరుపర్చండి: హైకోర్టు ఆదేశం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.