ETV Bharat / state

SRINIVAS GOUD ON CM KCR: 'కేసీఆర్ ​లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాలి' - సీఎం కేసీఆర్​ బర్త్​డే వార్తలు

SRINIVAS GOUD ON KCR NEW PARTY: సీఎం కేసీఆర్​ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ పేర్కొన్నారు. కేసీఆర్​ లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

SRINIVAS GOUD ON CM KCR: 'కేసీఆర్ ​లాంటి వ్యక్తి దేశ రాజకీయాల్లోకి రావాలి'

author img

By

Published : Feb 15, 2022, 5:14 AM IST

SRINIVAS GOUD ON KCR NEW PARTY: ముఖ్యమంత్రి కేసీఆర్​ లాంటి వ్యక్తి జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు దేశ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని తెరాస కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 17 రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు సహా పలు రాజకీయ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి కావాలని కోరుకుంటున్నాని శ్రీనివాస్​గౌడ్​ పేర్కొన్నారు. దేశంలో కావాల్సినన్ని నీళ్లున్నా.. సాగునీరు అందని భూములుండటం, కరెంటు ఉత్పత్తి ఉన్నా.. చాలా గ్రామాలకు చేరకపోవడం, పేదరిక నిర్మూలన, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ లాంటి అంశాల్లో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం తగదని మండిపడ్డారు.

SRINIVAS GOUD ON KCR BIRTHDAY: ఈ సందర్భంగా మహబూబ్​నగర్ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడంపై ముఖ్యమంత్రికి శ్రీనివాస్​గౌడ్​ కృతజ్ఞతలు తెలిపారు. ముడా ఏర్పాటుతో మహబూబ్​నగర్, జడ్చర్ల, భూత్పూర్​ ప్రాంతాల ముఖచిత్రమే మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న సీఎం కేసీఆర్​ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. 15న పండ్లు, దుస్తుల పంపిణీ, 16న రక్తదాన శిబిరాలు, 17న మొక్కలు నాటడం చేపట్టాలని పిలుపునిచ్చారు.

పక్కా విజన్​తో ముందుకు వెళ్తున్నాం..

MAHABUBNAGAR MASTER PLAN: అనంతరం మహబూబ్​నగర్​ మాస్టర్​ ప్లాన్​ ఏర్పాటుపై జిల్లా పరిషత్​ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమృత్ పథకం కింద ప్రణాళికా బద్ధంగా మహబూబ్​నగర్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2040 సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకొని.. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. పట్టణ సుందరీకరణతో పాటు రహదారులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ట్రాఫిక్ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించాలని కోరారు. ఈ క్రమంలోనే ఇతర పట్టణాలకు, నగరాలకు భిన్నంగా మహబూబ్​నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక విజన్​తో ముందుకు వెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'ఆపరేషన్ దిల్లీ' వేగవంతం.. త్వరలో ఆ సీఎంల సమావేశం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.