ETV Bharat / state

Srinivas Goud: డీకే అరుణ.. మీ భర్తకు చెప్పి ఆ వంతెనలు పూర్తయ్యేలా చూడండి: శ్రీనివాస్​గౌడ్​

తన భూముల కోసమే భారత్​మాల మార్గాన్ని మళ్లించినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మండిపడ్డారు. అభివృద్ధికి సహకరించాలే కానీ అనవసర ఆరోపణలు చేయొద్దని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు సూచించారు. మహబూబ్​నగర్​లో పెండింగ్​లో ఉన్న మూడు వంతెనలను పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

minister Srinivas goud
minister Srinivas goud
author img

By

Published : Jul 1, 2021, 6:20 PM IST

డీకే అరుణ.. మీ భర్తకు చెప్పి ఆ వంతెనలు పూర్తయ్యేలా చూడండి: శ్రీనివాస్​గౌడ్​

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని యువజన, క్రీడలు, పర్యావరణ శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ (Srinivas Goud) అన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందులో భాగస్వాములు కావాలని కోరారు. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు.

పాలకొండ దగ్గర నుంచి వెళ్తున్న భారత్​మాల రహదారిని మరో మార్గం గుండా వెళ్లాలని కొందరు ప్రతిపక్ష నేతలు డిమాండ్​ చేస్తున్నారని మంత్రి తెలిపారు. తన భూముల కోసమే భారత్​మాల మార్గాన్ని మళ్లించినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ మార్గం గుండా వెళ్లినా తనకు అభ్యంతరం లేదన్నారు. కావాలంటే తన భూముల్ని రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అభివృద్ధికి సహకరించాలే కానీ తనపై ఆరోపణలు చేయడం తగదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (Dk Aruna)కు హితవు పలికారు.

గతంలో మహబూబ్​నగర్​కు మంజూరైన బైపాస్​ రహదారిని గద్వాలకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా మరొకటి వస్తే.. దానిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. డీకే అరుణ భర్త భరత సింహారెడ్డి కాంట్రాక్టు తీసుకొని.. ఆరేళ్లు గడిచినా పూర్తిచేయని వంతెనల నిర్మాణం చేపట్టాలని సూచించారు. రూ.14 లక్షలతో పాలకొండ చెరువును మినీట్యాంక్ బండ్​గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

చేస్తే సాయం చేయండి.. లేకుంటే..

2015లో భారత ప్రభుత్వం.. భారత్​మాల పేరిట రోడ్డు మంజూరైంది. అది మళ్లా మూలకు పడ్డది. మహబూబ్​నగర్​కు బైపాస్​రోడ్డు వస్తే గద్వాలకు తీసుకుపోయారు. అభివృద్ధికి సహకరించాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కోరుతున్నా. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేయకండి. అమిస్తాపురం, పాలకొండ, భగీరథ కాలనీ వద్ద నున్న వంతెనలను మీ భర్త డీకే భరతసింహారెడ్డి తీసుకున్నారా లేదా చెప్పండి. ఆరేళ్లయింది కాంట్రాక్టు తీసుకొని.. అమిస్తాపురం బ్రిడ్జిని సగమే వేశారు. పాలకొండ వద్ద ఒకటే వేసి వదిలేశారు. భగీరథ కాలనీ వద్ద వంతెన అసలు ప్రారంభించలే. మీ ఊర్లో కాంట్రాక్టు తీసుకొని పూర్తి చేసుకున్నారు. మాఊరిలో పనులు పెండింగ్​లో పెట్టారు. భారత ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే చేయండి. లేనిపోని ఆరోపణలు చేయొద్దు. మీ భర్తకు చెప్పి మూడు వంతెను పూర్తయ్యేలా చూడండి.

-- శ్రీనివాస్​గౌడ్​, క్రీడా, యువజన, ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి

ఇదీచూండడి: KTR: ఇంటింటికి నల్లా .. కేసీఆర్​ ఘనతే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.