మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం, నిజలాపూర్ గ్రామంలో రెండు పడక గదుల నిర్మాణాలను మంత్రి శ్రీనివాస్ పరిశీలించారు. నిజలాపూర్లోని 33/11KV విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడానికి వచ్చిన మంత్రి మండలంలోని పలు గ్రామాలకు చెందిన కల్యాణ లక్ష్మీ అర్హులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి తండ్రిగా మారి కల్యాణ లక్ష్మీ పథకం కింద లక్ష రూపాయలు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: వైరల్: తుపాకులతో భాజపా ఎమ్మెల్యే గానాభజానా