ETV Bharat / state

మూడు నెలల్లో కొడంగల్​ రూపురేఖలు మారుస్తాం : మంత్రి సబితారెడ్డి - మహబూబ్​ నగర్​

కొడంగల్​ నియోజకవర్గంలోని బొమ్మరాసిపేట, కొడంగల్​ మండలాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే మూడు నెలల్లో కొడంగల్​ నియోజకవర్గ రూపురేఖలను మార్చి.. అభివృద్ధి పథంలో నడిపిస్తానని మంత్రి అన్నారు.

Minister Sabitha Redddy Inaugurates Development Works
మూడు నెలల్లో కొడంగల్​ రూపురేఖల్ని మారుస్తాం : మంత్రి సబితా రెడ్డి
author img

By

Published : Jun 17, 2020, 5:44 PM IST

మహబూబ్​ నగర్​ జిల్లా కొడంగల్​ నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. వచ్చే మూడు నెలల్లో కొడంగల్​ నియోజకవర్గ రూపురేఖల్ని మారుస్తామని అన్నారు. నియోజకవర్గంలోని కొడంగల్​, బొమ్మరాసిపేట మండలాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొడంగల్​ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్​ ప్రత్యేక చొరవ చూపుతున్నారని మంత్రి అన్నారు.

ఇప్పటికే పెండింగ్​లో ఉన్న డిగ్రీ కళాశాల భవనం,మినీ ట్యాంక్​బండ్​ నిర్మాణం, దౌల్తాబాద్​ మండలంలోని జూనియర్​ కళాశాల నిర్మాణం , క్రోసూరు మండల కేంద్రంలో బస్​డిపో తదితర నిర్మాణాలతో పాటు.. పెండింగ్​లో ఉన్న పనులన్నింటినీ వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. బొమ్మలరాసిపేట మండల కేంద్రంలో రైతు వేదిక నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్​ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.