రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్‌లో మొక్కలు నాటారు. పచ్చని పాలమూరు కోసం ప్రతి పౌరుడు ఇంట్లో, బయట మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని మంత్రి తెలిపారు.
ఐదో విడత హరితహారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు కోట్ల 60లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకుకెళ్తున్నట్లు కలెక్టర్ రొనాల్డ్ రోస్ వెల్లడించారు. ఇప్పటికే 30లక్షల మొక్కలు నాటామన్న ఆయన.. రోజూ 2 నుంచి 3లక్షల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఇకపై వ్యవసాయానికి మాత్రమే వ్యవసాయ రుణాలు