మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతుపై ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన కార్యశాలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తక్కువ విస్తీర్ణంలో భూమి ఉన్నా నాణ్యతతో కూడిన కూరగాయలు, పండ్లు పండిస్తే రైతుకు మంచి లాభాలు వస్తాయని ఆయన సూచించారు. పండ్లు, కూరగాయలను ప్రాసిసెంగ్ చేయడం, మార్కెటింగ్ చేసుకోవటం వల్ల ఎగుమతులకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడించారు. అందుకే జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మరో ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఆయన వివరించారు.
ఇవీచూడండి: 'ఎడారిలో ఒయాసిస్సు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రామోజీ రావు