mid day meal problems in Mahabubnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మధ్యాహ్నం భోజన పథకం ప్రహసనంగా మారింది. 3,188 ప్రభుత్వ పాఠశాలల్లో మూడున్నర లక్షల మంది విద్యార్థులు సర్కారీ బళ్లలో చదువుతున్నారు. ఈ విద్యార్థులందరికీ వంట చేసే మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాల్సిన బాధ్యత వంట ఏజెన్సీలదే. కానీ అలాంటి బాధ్యతల్లో ఉండటం కంటే తప్పుకోవడానికే ఎక్కువ మంది ఏజెన్సీలు మొగ్గు చూపుతున్నాయి. కారణం ఆ ఏజెన్సీలకు అందాల్సిన బిల్లులు సకాలంలో అందకపోవడమే. కొంతమంది అప్పులు చేసి మరీ వంటలు చేసి పెడుతున్నారు.
గుడ్లు కోసం అదనంగా చెల్లిస్తున్నాం: మధ్యాహ్న భోజనం వంట పెట్టే ఏజెన్సీలకు ప్రాథమిక పాఠశాలలో ఒక్కో విద్యార్థికి రూ.4.97 పైసలు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రూ.7.45 పైసలు వారానికి మూడు చొప్పున గుడ్లకు రూ.15 అదనంగా చెల్లిస్తారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు భోజనం, గుడ్డు కలుపుకుని రూ.9.95 పైసలు చెల్లిస్తారు. పెరిగిన కూరగాయలు, నిత్యావసరాలు, గుడ్డు ధరలకు తమకు గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు.
బిల్లులు సక్రమంగా అందడం లేదు: మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని పాఠశాలలకు అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందుతోంది. అక్కడ ఏజెన్సీ నిర్వాహకులే విద్యార్థులకు గుడ్లు అందించాలి. ఆ గుడ్డు బిల్లులు కూడా సక్రమంగా రావడం లేదని మహిళలు వాపోతున్నారు. అధికారులు మాత్రం బడ్జెట్ మంజూరైందని ఖాతాల్లో డబ్బులు జమ చేయడమే మిగిలి ఉందని, ఆగస్టు వరకూ అన్ని బిల్లులు, గౌరవ వేతనాలు అందిస్తామని చెబుతున్నారు. ప్రతి నెలా అదే సమాధానం వస్తోందని డబ్బులు మాత్రం జమచేయడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి: