జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసన తెలిపారు. వైద్య విద్యార్థులు, సామాన్యులకు నష్టం చేకూర్చే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్యను ప్రైవేటీకరించేందుకు కేంద్రం యోచిస్తోందన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కశ్మీర్ భద్రత, భవితపై మోదీ భరోసా