ETV Bharat / state

పోలీసులు విచారిస్తారేమోనని... ఆత్మహత్య చేసుకున్న వివాహిత...! - SUICIDE NEWS IN TELANGANA

తన కళాశాల స్నేహితుడు మరణం విషయంలో తనను ఎక్కడ అనుమానిస్తారోనన్న భయంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనుమానస్పదంగా మృతి చెందిన స్నేహితుని విషయం తెలియగానే వివాహిత ఆత్మహత్య చేసుకోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

MARRIED WOMEN SUICIDE IN MAHABOOBNAGAR
MARRIED WOMEN SUICIDE IN MAHABOOBNAGAR
author img

By

Published : Feb 29, 2020, 10:36 AM IST

మహబూబ్​నగర్​లో ఓ వివాహిత ఉరి వేసుకుని అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ప్రేమ్‌నగర్‌కు చెందిన సుధారాణి... ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో చున్నితో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలంలో ఉన్న సుసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గద్వాలకు చెందిన కార్తీక్‌ అనే యువకుడు మూడు రోజుల కింద అదృష్యమై దారుణ హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. కార్తీక్​, సుధారాణి పాత స్నేహితులు కాగా... ఫోన్లలో తరచూ మాట్లాడుకునే వారు. మృతుడు కార్తీక్‌ సెల్‌ఫోన్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు తనకు ఫోన్​ చేస్తారని భయపడి సుధారాణి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భర్త అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

సుధారాణి ఆత్మహత్యపై దర్యాప్తు జరపాలని మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు మనస్పర్థలు లేవని.. గద్వాలలో జరిగిన ఏదో ఘటనలో తన మిత్రుడు మృతి చెందినట్టు సుధారాణి తన దృష్టికి తీసుకువచ్చినట్టు భర్త తెలిపాడు.

పోలీసులు విచారిస్తారేమోనని... ఆత్మహత్య చేసుకున్న వివాహిత...!

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.