లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో.. మహబూబ్‌నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధికారులు భక్తులకు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను మూసివేయగా.. కేవలం అంతరాలయంలో ముఖ్యమైన సేవలను మాత్రమే నిర్వహిస్తున్నారు.
భౌతిక దూరం కనీసం 6 అడుగులు...
పేదల తిరుపతిగా పేరొందిన మన్యంకొండలో భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం వెలుపల, క్యూలైన్లు శానిటైజ్ చేశారు. భౌతిక దూరం కనీసం 6 అడుగులు పాటించే విధంగా గుర్తులను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వామి వారి దర్శనము కల్పించనుండగా.. దర్శన అనంతరం ఇచ్చే తీర్థం, శఠగోపం, ప్రసాద వితరణను ఆలయ అధికారులు నిషేధించారు.
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా