ETV Bharat / state

Dharani Problems: ధరణి లోపాలు.. రైతులకు శాపాలు - తెలంగాణ తాజా వార్తలు

Dharani Problems: తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు. గతంలో పట్టాలు ఉన్నాయి. కానీ ధరణి వచ్చాక వారికి సమస్యలు మొదలయ్యాయి. రైతుబంధు లేదు, బీమా లేదు, పంట రుణాలూ లేవు. కొత్తపాస్‌ పుస్తకాలు అందక.. ప్రభుత్వ సాయం చేరక భూమినే నమ్ముకుని బతుకీడుస్తున్న కుటుంబాలు గోస పడుతున్నాయి.

Dharani
Dharani
author img

By

Published : Mar 15, 2022, 2:00 PM IST

Dharani Problems: ధరణి లోపాలు.. రైతులకు శాపాలు

Dharani Problems: మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తూరు, మల్లాపూర్ శివారులో తరతరాలుగా ప్రభుత్వ భూములను సాగుచేసుకుంటున్న రైతులు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అన్యాయానికి గురవుతున్నారు. ఆ రెండు గ్రామాల శివారులోని 311 సర్వే నంబర్​లో 245 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వాటిని 200 మందికి పైగా రైతులు తరతరాలుగా సాగుచేస్తున్నారు. 1954 నుంచి వంశపారంపర్యంగా వారికి సక్రమించిన పట్టాదారు పాసుపుస్తకాలు వారి వద్ద ఉన్నాయి. కానీ భూరికార్డుల ప్రక్షాళన తర్వాత అందులో చాలామంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాలేదు. బాధితుల్లో కొంతమంది ఇటీవలే మరణించారు. ధరణి పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబీమా అందలేదు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

భూమున్న పట్టాలు లేవు..

పండించిన పంటను అమ్ముకునేందుకు రైతన్నలు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం లేకపోవడం వల్ల పంటల నమోదులో వారి పేర్లు ఉండటం లేదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమికి... పట్టాలు రాక తిప్పలు పడుతున్నామంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమి లేకున్న పట్టాలున్నాయ్​..

పట్టాలు రాక అసలు రైతులు అవస్థలు పడుతుంటే.. అసలు భూములు లేకున్నా, సాగు చేయకున్నా కొందరు పాసుపుస్తకాలు పొంది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. 311 సర్వే నెంబర్‌లో అసలు విస్తీర్ణం కంటే అధికంగా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అనర్హుల లెక్కలు తేల్చి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఈ సమస్యపై మిడ్జిల్​ తహసీల్దార్​ స్పందించారు. అన్నదాతల సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు.

ఇదీచూడండి: KTR Tweet On Kaleswaram: 'కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకివ్వరు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.